ప్రతి హీరో ఎదిగాడు అంటే ఏదో ఒక స్టార్ నేమ్ తో ఎదిగి మంచి పేరు తెచ్చుకుంటారు. ఒకరు యాక్షన్ హీరో అని అవార్డు తెచ్చుకుంటే మరొకరు కామెడీ హీరో అని.. మరొకరు ఎంటర్టైన్మెంట్ హీరో అని పేరు తెచ్చుకుంటుంటారు. మరికొందరు ఫ్యామిలీ హీరోస్ అని పేరు తెచ్చుకుంటుంటారు. ఇంకా మరికొందరు మాత్రం లవర్ బాయ్స్ అని పేరు తెచ్చుకుంటారు. అయితే లవర్ బాయ్స్ అని పేరు తెచ్చుకున్న వారు ఎవరు కూడా పెద్దగా ఫేమస్ అవ్వలేదు అంటే నమ్మండి. ఫేమస్ అవ్వడం పక్కన పెడితే.. అసలు వాళ్ళు కనుమరుగయ్యారు. అలా అయ్యిన వారు ఎవరో ఇక్కడ చదివి తెలుసుకుందాం... 

 

ఉదయ కిరణ్.. 

 

లవర్ బాయ్ గా మంచి పేరు సంపాదించాడు.. నిజం చెప్పాలి అంటే.. ఉదయ్ కిరణ్ కి వచ్చినంత పేరు ఏ హీరోకు రాలేదు. ఎందరో హీరోలు ప్రయత్నించినప్పటికీ వారికీ పేరు రాలేదు. అలాంటి లవర్ బాయ్ పేరు తెచ్చుకున్న హీరో కొద్దీ కాలానికే అట్టర్ ప్లాప్ అయ్యాడు అంటే నమ్మండి. ఇక సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యి .. ఆతర్వాత సూసైడ్ చేసుకున్న విషయం తెలిసినదే. 

 

తరుణ్.. 

 

మొదటి సినిమాతోనే లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో.. మళ్లీ తీసిన ఎన్నో సినిమాలు మాములు హిట్ అందుకున్నాయి తప్ప తరుణ్ తీసిన సినిమాలు పెద్దగా ఏవి సూపర్ హిట్ కాలేదు.. అలా సినిమాలు తీస్తూ కాలం గడిపిన తరుణ్ కు కూడా వరుసగా ప్లాప్ లు అవ్వడంతో తరుణ్ సినీ ఇండస్ట్రీలో కనుమరుగైపోయాడు. 

 

సిద్దార్థ.. 

 

సిద్దార్థ అప్పట్లో తీసిన ప్రేమ సినిమాలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా అయితే మళ్లీమళ్లీ చూడాలి అనిపిస్తుంది. ఆ సినిమా అంత సూపర్ గా ఉంటుంది. ఇంకా బొమ్మరిల్లు సినిమా అయితే అప్పట్లో ఓ పెద్ద హిట్ అనే చెప్పాలి. అలాంటి హీరో.. కొద్దీ రోజులకు అందరికి బోర్ కొట్టేశాడు.. తీసిన సినిమాలు అన్ని ఒకటికి ఒకటి ప్లాప్ అవుతూ వచ్చాయ్. దీంతో సిద్దార్థ కూడా ఇండస్ట్రీలో కనుమరుగయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: