బుల్లితెరపై దాదాపు ఓ దశాబ్దంపాటు కొనసాగుతున్న అనసూయ భరద్వాజ్ తన అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం సిగ్గు పడదు. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా సాంప్రదాయకంగా చీరలు కట్టుకోకుండా బుల్లి తెర పై పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ శృంగారభరిత నాట్యాలు చేస్తూ మహిళల ఆగ్రహానికి కారణమవుతుంది. ఇటీవల కాలంలో ఓ ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రారంభమైన ప్రోగ్రాం లో ఆమె చేసే నాట్యాలు చూస్తే ఎవరికైనా రోత పుడుతుంది. కోట్ల మంది ప్రజలు తమ కుటుంబ సమేతంగా చూస్తున్న టీవీ షో లలో ఆమె పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ రెచ్చగొట్టే డాన్స్ లు చాలా చేయడం ఎంత మాత్రం సరికాదని చాలా మంది యూట్యూబ్ వీక్షకులు ఆమెను తీవ్రంగా తిట్టిపోస్తున్నారు.




చూస్తే చూడండి లేకపోతే మానండి అనడానికి ఇది వెండితెరపైన సినిమా కాదు పిల్లలు, తల్లిదండ్రులు కలసి కూర్చొని చూసే ఫ్యామిలీ సీరియల్స్, ప్రోగ్రాములు. ఇవి కూడా ఇంత దారుణంగా దిగజారిపోవడం చాలా బాధాకరమని మరి కొంతమంది అంటున్నారు. ముఖ్యంగా ఇటువంటివి చేయడానికి ముందుకొచ్చే వారి వలనే నేటి సమాజం చెడిపోతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అనసూయ శృంగార పాటలకు నృత్యాలు చేస్తూ బుల్లితెర అశ్లీలతకు నాంది పలుకుతుంది. గుడ్డ పీలిక లాంటి చీరలు కట్టుకొని తన ఎద భాగం చూపిస్తూ నడుము మొత్తం అందరికీ కనిపించేలా డాన్స్ మాస్టర్లతో అనసూయ రొమాన్స్ చేయడం ప్రస్తుతం నెట్టింట పెద్ద దుమారం రేపుతోంది.





సినిమాలలో అభ్యంతరకరమైన, అశ్లీలమైన సన్నివేశాలను కట్ చేయడానికి సెన్సార్ బోర్డు ఉంటుంది కానీ బుల్లితెరకు అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే బుల్లితెర పోగ్రామ్ నిర్వాహకులు ప్రతి సీరియల్ని, ప్రోగ్రామ్ ని ఫ్యామిలీ చూసే విధంగా తీస్తారు కాబట్టి. కానీ ప్రస్తుతం వచ్చే టీవీ షోలలో అన్ని పచ్చి బూతులు డబల్ మీనింగ్ కుళ్ళు జోకులు, అక్రమ సంబంధాలు గురించి సన్నివేశాలు తప్ప మరే ఇతర మంచి సీరియల్ లో కానీ ప్రోగ్రామ్స్ కానీ రావడం లేదు. అనసూయ కి మాత్రం కనీస రెస్పాన్సిబిలిటీ లేదు. యుక్తవయసు అబ్బాయిలు టీవీలను చూస్తారని తెలుసి కూడా కాస్త కూడా బుద్ధి లేకుండా ఆమె రెచ్చగొట్టే డాన్స్ లు చేయడం బాధాకరం. టీవీ నిర్వాహకులు కూడా రేటింగ్ పడిపోతుంది కదా అని ఆడవాళ్ళతో అడల్ట్ డాన్సులు వేయించడం సరికాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: