నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు, ఆహా.. ఇలా అనేక రకాల డిజిటల్ సేవలు నూతన టెక్నాలజీ మనముందికి వచ్చి మనలని బానిసలని చేస్తున్నాయి అని చెప్పవచ్చు. మొదట్లో నాటకాలు, ఆ తరువాత సినిమాలు.. కాని ఇప్పుడు అంత డిజిటల్ మయం. ప్రస్తుతం దేశంలో ఎంటర్టైన్మెంట్ రంగం కొత్త రంగులు పూసుకుంది. నూతన టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో దీనికి తోడు ఇంటర్నెట్, మోబైల్ స్ట్రీమింగ్ సేవలు కూడా అందరికి అనుకూల ధరల్లో రావడంతో ఇండియాలో డిజిటల్ మీడియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. 

 

 


దీనితో ఇప్పుడు మన దేశానికి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ డిజిటల్ మీడియా కంపెనీలు వస్తున్నాయి. అయితే అందులో భాగంగా ప్రస్తుతం భారత్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు ఇంకా చాలా డిజిటల్ సేవలు వచ్చి చాలా ప్రాచుర్యం పొందాయి. కాకపోతే ఈ సంస్థలు కేవలం హాలీవుడ్ కాంటెంట్‌ ను మాత్రమే ఇండియన్ ప్రేక్షకులపై రుద్దకుండా సొంతంగా వారి కాంటెంట్‌ ను ప్రొడ్యూస్ ఇస్తున్నాయి. వాటినే మనం ఇప్పుడు ఒరిజనల్స్‌ గా అంటున్నాము. 

 

 


ఇక ఇవి ఒరిజనల్స్‌ లో హిందీలో కియారా అద్వానీ నుండి రాధికా ఆప్టే వరకు వెబ్ సిరీస్‌ లు చేస్తూ ఇక్కడ డిజిటల్‌ లో అక్కడ సినిమాల్లో మంచి అవకాశాలు కొట్టేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే   తెలుగులో కూడా ఇలాంటీవి మొదలు అవుతున్నాయి. ఇటీవలే హీరోయిన్ సమంత అమెజాన్ ప్రైమ్ వెబ్‌ సిరీస్‌ అయిన "ఫ్యామిలీ మ్యాన్‌" సీజన్‌ లో తాను నటిస్తోంది. అయితే ఈమె దారిలోనే కాజల్ అగర్వాల్ కూడా వెబ్‌ సిరీస్‌ లో నటించేందుకు ఓకే చేసినట్టు సమాచారం. తమిళంలో రుపొందిస్తున్న ఒక వెబ్‌సిరీస్‌లో అందాల కాజల్ నటించేందుకు ఒప్పుకుందని సమాచారం తెలుస్తోంది.

 

 

అయితే ప్రస్తుతం తమన్నా కూడా వీరి తరహాలోనే వెబ్‌ సిరీస్‌ల్లోకి రానునట్లు తెలుస్తోంది. ‘ది నవంబర్‌ స్టోరీ’ అనే వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌లోకి ఆవిడ ప్రవేశిస్తోంది అని సమాచారం. ఇక్కడ సినిమాలతో పోలిస్తే నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని వారి వారి నమ్మకం.

మరింత సమాచారం తెలుసుకోండి: