ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ అప్ప‌టికి ఇప్ప‌టికీ ఎప్పుడూ ఒకేలా ఉంది. ఒకప్పుడు ప‌వ‌న్‌ని ల‌వ‌ర్‌బాయ్‌గా చూసేవాళ్ళు చాలా మంది యూత్‌. ఆయ‌న హెయ‌ర్‌స్టైల్ ని ఆయ‌న డ్ర‌స్సింగ్ స్టైల్‌ని ఇలా ఆయ‌న న‌డ‌క న‌డ‌త మొత్తం అన్నీ అప్ప‌ట్లో యూత్ తెగ ఫాలో అయ్యేవారు. ఇక గుడుంబా శంక‌ర్ వ‌చ్చిన టైమ్‌లో అయితే ఆయ‌న వేసుకున్న ఆరు జిప్పుల ప్యాంట్ కి ఫుల్ క్రేజ్ వ‌చ్చింది. అప్ప‌ట్లో ఎవ‌రు చూసినా గుడుంబాశంక‌ర్ ప్యాంట్ అనేవాళ్ళు. అలాగే ఆయ‌న మ్యేన‌రిజ‌మ్స్ కూడా ఫుల్ ఫాలో అవుతారు అంద‌రూ ఇక ఇదిలా ఉంటే తొలిప్రేమ చిత్రం స‌మ‌యంలో ఆయ‌న ఇచ్చే లుక్స్‌..స్టైల్స్ కూడా అంద‌రూ ఫాలో అయ్యేవారు.

 

ఇక అప్ప‌ట్లో ఆయ‌న ల‌వ‌ర్‌బాయ్‌లా ఉండేవారు. ఎటు చూసినా ప‌వ‌న్ ఫ్యాన్స్‌.. ప‌వ‌న్ స్టైల్ క‌నిపించేది. అలాగే ఆ చిత్రంలోని సీన్స్ కూడా త‌ర్వాత చాలా సినిమాల్లో వాడారు. కీర్తిరెడ్డి చీక‌ట్లో చిచ్చుబుడ్డి వెలిగించే సీన్ త‌ర్వాత హాస్యంగా ఎన్నో చిత్రాల్లో పెట్టారు. అలాగే ఇప్ప‌టికి కొన్ని చిత్రాల్లో ఆయ‌న మేన‌రిజ‌మ్స్ చాలా మందికి న‌చ్చి అవి ఫాలోఅవుతుంటారు. త‌ర్వాత ఖుషీ సినిమా గురించ‌యితే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అప్ప‌ట్లో భూమిక‌,ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క‌లిసి న‌టించి ఈ చిత్రం ఓ సునామినే సృస్టించింద‌ని చెప్పాలి. అందులో ప‌వ‌న్ ప్ర‌తి స్టైల్ మ‌ర్చిపోలేనిదే. పార్క్‌లో భూమిక‌ను చూసే విధానం. అలాగే రెస్టారెంట్‌లో నూడుల్స్ తినే విధానం ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సినిమాలో చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

 

త‌ర్వాత జ‌ల్సా చిత్రంలో ఇలియాని ప‌క్క‌న అద‌రగొట్టార‌నే చెప్పాలి. గ‌బ్బ‌ర్‌సింగ్‌లో పోలీస్ గెట‌ప్‌లో విల‌న్స్ ఆయ‌న అంత్యాక్ష‌రి ప్రోగ్రామ్ హైలెట్‌గా నిలిచింది. ఇలా ప్ర‌తి సినిమాలో ఆయ‌న వేరు వేరు గెట‌ప్‌ల‌లో వేరియేష‌న్స్ చూపించుకుంటూ కొత్త త‌ర‌హాలో కొత్త స్టైల్స్‌ని ఫాలో అవుతూ ఉంటారు ప‌వ‌ర్‌స్టార్‌. మరి ఇటీవ‌లె విడుద‌లైన వ‌కీల్‌సాబ్ కూడా ఆయ‌న చైర్‌లో స్టైలిష్‌గా కూర్చున్న లుక్ అదిరిపోయింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: