అక్కినేని ఫ్యామిలీలో ఒక ర‌కంగా చెప్పాలంటే ల‌వ‌ర్‌బాయ్స్ ఎక్కువే ఉన్నార‌ని చెప్పాలి. అక్కినేని నాగేశ్వ‌రావు నుంచి నాగార్జున ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య వ‌ర‌కు అంద‌రూ ల‌వ‌ర్‌బాయ్సే. ఇక వీరి క్రేజ్ యూత్‌లో అంత‌లా ఉంటుంది. అలాగే ఈ హీరోల‌కి లేడీస్ ఫాలోయింగ్ కూడా కాస్త ఎక్కువ‌నే చెప్పాలి.  ఏమాయ చేశావె చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన నాగ‌చైత‌న్య ఏం మాయ చేశాడోగాని స‌మంత‌ని స్యామ్ చైతుని త‌ప్ప లైఫ్‌లో ఇంకెవ‌రినీ వివాహం చేసుకోకూడ‌ద‌ని డిసైడ్ అయిపోయింది. అంతే చైతూని పెళ్ళి చేసుకుని చ‌క్క‌గా లైఫ్‌లో సెటిల్ అయిపోయింది. త‌ను ఒక స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉండి ఉండి కూడా ఇంకా అప్ప‌టికీ పెద్ద‌గా క్రేజ్ రాక‌పోయినా నాగ‌చైత‌న్య‌ను వివాహం చేసుకుందంటేనే అర్ధ‌మవుతుంది చైతుకి ఎంత‌లా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న‌ది.

 

ఇక ఇదిలా ఉంటే నాగ‌చైత‌న్య చేసిన సినిమాల‌న్నీ కూడా దాదాపు ల‌వ్‌స్టోరీస్ అయితే మాత్రం అన్నీ సూప‌ర్ డూపర్ హిట్లు కొట్టాయి. అదే త‌ను ఎక్క‌డ‌న్నా యాక్ష‌న్‌చూపిస్తే ఆ సినిమా పెద్ద‌గా ఆడేది కాదు. అంటే ప్రేక్ష‌కులు త‌న‌ను ఒక ల‌వ‌ర్‌బాయ్‌గా ఎంత‌లా యాక్సెప్ట్ చేశార‌నేది దీన్ని బ‌ట్టే అర్ధ‌మ‌వుతోంది. చైతు న‌టించిన ప్రేమ‌మ్‌, 100పర్సెంట్ ల‌వ్ ఇవ‌న్నీకూడా ల‌వ్‌స్టోరీస్ ఇవి సూప‌ర్‌డూప‌ర్ హిట్లు కొట్టాయి.  మ‌రి సునీల్‌తో కలిసి న‌టించిన త‌డాకా ఆత‌ర్వాత వ‌చ్చిన స‌వ్య‌సాచి చిత్రాలు మాత్రం ఆశించినంత హిట్ కాలేదనే చెప్పాలి.

 

అలాగే ల‌వ‌ర్‌బాయ్‌గా మంచి పేరు తెచ్చుకున్న చైతు కెరియ‌ర్ ప్రస్తుతం మంచి ఊపుమీద ఉంద‌ని చెప్పాలి. రారండోయ్ వేడుక చూద్దాం, శైల‌జారెడ్డి అల్లుడు, మ‌జిలి ఇవ‌న్నీ కూడా మంచి హిట్లు కొట్టాయి. మ‌రి ప్ర‌స్తుతం ఆయ‌న శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్‌స్టోరి అనే చిత్రంలో న‌టిస్తున్నారు. అందులో సాయిప‌ల్ల‌వికి జోడిగా న‌టిస్తున్నారు. మ‌రి వీరిద్ద‌రి రొమాన్స్ ఎలా ఉండ‌బోతుందో తెర‌మీదే చూడాలి. ఈ చిత్రం హిట్ కొడితే ఇక క‌న్‌ఫ‌ర్మ్‌గా చైతూ ల‌వ‌ర్‌బాయ్ అని చెప్పేయొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: