రకుల్ ప్రీత్ సింగ్. పొడుగు కాళ్ళ సుందరి. ఆమె అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఒక టైంలో టాప్ స్టార్ హీరోయిన్ గా ఊపేసింది. కుర్ర కారు కలల్లోనే కాపురం ఉంటూ వచ్చింది. లక్కీ గర్ల్ అని కూడా చెప్పాలి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ఇలా వచ్చి అలా టాలీవుడ్లో సెట్ అయిపోయింది.

 

రకుల్ తో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు జోడీ కట్టిన హీరోలు కూడా  ఉన్నారు. ఆమె కాల్ షీట్ కోసం వెయిట్ చేసిన సూపర్ స్టార్లు ఉన్నారు. అయితే అవన్నీ ఫ్లాష్ బ్యాక్ గానే చెప్పుకోవాలి. ఇపుడు రకుల్ ప్రీత్ సింగ్ వెనక్కి తగ్గింది. ఎందుకో తెలియదు. గ్లామర్ ఫుల్ గా ఉంది. నటనలో మరింత మెచ్యూరిటీ వచ్చింది. ఫిజిక్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తూ రకుల్ చూడు చూడు అంటోంది.

 

అయినా నిన్నటి వరకూ ఆమెను ఆరాధించి అభిమానించిన టాలీవుడ్ ఎందుకో పట్టించుకోవడంలేదు. ఇవన్నీ పక్కన పెడితే రకుల్ లేటెస్ట్ గా సౌత్ ఇండియా హీరోల మీద కొన్ని కామెంట్స్ చేసింది. సౌత్ హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారని కూడా ఆమె చెప్పుకొచ్చింది. వారంటే ఫ్యాన్స్ కి మోజు ఎక్కువని, ఇది సౌత్ లోనే ఎక్కువగా కనిపిస్తోందని కూడా లాజిక్ గా మాట్లాడింది.

 


వారిని చూసే ఫ్యాన్స్ సినిమాలకు వస్తారని, కాబట్టి వారికి ఎక్కువగా పారితోషికాలు ఇవ్వడంతో తప్పులేదని కూడా మరో వైపు సపోర్టుగా మాట్లాడింది. ఇక వారితో పోలిస్తే తమకు తక్కువగానే ఇస్తారని కూడా వాపోయింది. ఓ వైపు సౌత్ హీరోలకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం న్యాయమేనని చెబుతూనే మరో వైపు హీరోయిన్లకు చిన్న చూపు చూస్తున్నారని రకుల్ అనడంలో అనేక అర్ధాలు ఉన్నాయని అంటున్నారు.

 

రకుల్ ఇప్పటికీ గ్లామర్ స్టారే. హీరోల ఏజ్ కంటే కూడా చాలా చిన్నది. కానీ అపుడే ఆమె అవుట్ డేటెడ్ అయినట్లుగా పక్కన పెట్టేయడంతోనే రకుల్ తన ఆవేదనను ఈ విధంగా వెళ్ళగక్కిందని అంటున్నారు. చూడాలి ఈ అమ్మడు ముందు ముందు మరెన్ని కామెట్స్ చేస్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: