ఈ మద్య మహిళలపై లైంగిక వేధింపులే కాదు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి.  చిన్న పిల్లలు అని కూడా చూడకుండా దుర్మార్గులు రెచ్చిపోతున్నారు.   ఈ లైంగిక వేధింపులు కేవలం సామాన్య మహిళలకే కాదు సెలబ్రెటీలకు కు కూడా తప్పడం లేదు.  ఈ మద్య కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమాల ద్వారా సెలబ్రెటీలు ఎంతో మంది తమ పై జరిగిన లైంగిక వేధింపులపై గళం విప్పారు.  అంతే కాదు తమపై ఎలాంటి లైంగిక వేధింపులు జరిగినా సోషల్ మీడియా ద్వారా కడిగి పడేస్తున్నారు. తాజాగా జెమినీ, సొంతం చిత్రాల్లో తన అందాలతో ఆకట్టుకున్న నమిత.. తర్వాత బాలయ్యతో సింహ చిత్రంలో సింగమంటీ కుర్రోడే అంటూ ఐటమ్ సాంగ్ లో నటించింది.

 

ఈ మద్య  నటి  న‌మిత త‌నతో అస‌భ్యంగా మాట్లాడిన వ్య‌క్తి బండారాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఓ  వ్య‌క్తి  న‌మిత‌తో  చాటింగ్ చేశాడు.  హాయ్  ఐటమ్ అని సంభోదిస్తూ చాటింగ్  చేయ‌డంతో ఒళ్లు మండిన నమిత నెటిజన్‌తో వాదనకు దిగింది.  ముందు  తన సోషల్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని చెప్పిన వ్య‌క్తి, న‌మిత ఆ  మాట‌ల‌ని న‌మ్మ‌డం లేద‌ని తెలియ‌డంతో  నమితను బెదిరించడం మొదలుపెట్టాడు. అంతే కాదు ఓ అడుగు ముందుకు వేసి నీ ఫోర్నో వీడియోలు తన వద్ద ఉన్నాయని.. వాటిని బయట పెట్టి రచ్చ చేస్తానని బెదిరించాడు.

 

దీంతో ప‌క్కా ప్లాన్ వేసిన న‌మిత త‌న‌ని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న వాడి బండారం బ‌య‌ట పెట్టేసింది. అతడి గురించి వివ‌రిస్తూ త‌న‌తో చాట్ చేసిన విష‌యాల‌ని స్క్రీన్ షాట్‌తో సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేముంది గురుడు మింగలేక కక్కలే అన్న పరిస్థితిలో చిక్కుకున్నాడు.  అయితే తన ఫోర్న్ వీడియోలు.. అవి ఇవీ అంటూ బెదిరించగానే భయపడి ఉంటే నమిత ఇప్పుడు చిక్కుల్లో పడిఉండేదని.. న‌మిత ధైర్యాన్ని నెటిజ‌న్స్ ప్ర‌శంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: