సుడిగాలి సుధీర్, రష్మిల జోడీ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ జోడీ ఆడియన్స్ లో బాగా పాపులర్ అయ్యింది. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య రిలేషన్ ను ఇంత కమర్షియల్ గా వాడుకోవచ్చనే రేంజ్ లో ఛానళ్లు ఈ రిలేషన్ ను వాడుకుంటున్నాయి. జనం కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీన్ ఇలా ఉంటే మధ్యలో వచ్చి ఎంటరయ్యాడు ప్రదీప్..

 

 

కొన్ని షోలలో ప్రదీప్, రష్మీ, సుడిగాలి సుధీర్ మధ్య రిలేషన్ కు సంబంధించే ఎక్కువ స్పేస్ కేటాయిస్తారంటే.. అది ఎంత క్రేజో అర్థం చేసుకోవచ్చు. వీళ్ల రిలేషన్ చూసి అనేక రూమర్స్ కూడా వచ్చేశాయి. సుడిగాలి సుధీర్ రష్మీ పెళ్లి చేసుకోబోతున్నారనేది చాలా పాత అరిగిపోయిన రూమర్.. ఆ తర్వాత సుధీర్ ఎంట్రీ ఇచ్చాక.. రష్మీ, ప్రదీప్ మధ్య ఏదో ఉందని.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మరో గాసిప్ వచ్చింది.

 

 

అయిత ఇవన్నీ గాసిప్ లో .. వీటిని వాళ్లు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఇటీవల ఓ షోలో ప్రదీప్ ఓ ఇంట్రస్టింగ్ వాస్తవం చెప్పాడు. అదేంటో తెలుసా... ప్రదీప్, సుడిగాలి సుధీర్‌, రష్మి, ప్రియమణి నలుగురికి ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఉందట. దాని పేరు కూడా చాలా తమాషాగా ఉంటుందట.

 

 

ఇంతకీ ఆ వాట్సాప్ గ్రూపు పేరేంటో తెలుసా.. ఉప్‌చిక్‌.. ఉప్‌చిక్‌.. ఉప్పా.. ఉప్పా.. అందరి దగ్గరా గ్రూప్‌లు ఉన్నాయి. మన గ్రూప్‌నకు ఏం పేరు పెడదామని అడిగినప్పుడు ఈ పేరు పెట్టామని చెప్పాడు ప్రదీప్.. ఈ గ్రూపులో శేఖర్‌ మాస్టర్‌.. యానీ మాస్టర్‌ కూడా ఉన్నారట. వాట్సప్ గ్రూపు పేరు చాలా బాగుందని అంతా మెచ్చుకున్నారట. అదీ సంగతి. మరి ఈ గ్రూపులో ఏం ఛాట్ చేసుకుంటారో.. ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: