ఇప్పుడు ఎవరి నోట విన్నా కరోనా మాటే.. అంతగా ప్రభావితం చేస్తుంది ఈ కరోనా వైరస్.  ప్రపంచంలో ఈ కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే 5వేల మందికి పైగా మరణాలు సంభవించాయి.  లక్ష మందికి పైగా ఈ రోగాన భారిన పడుతున్నారు.  గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్ -19) గురించి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు.. యాంకర్లు, బాలీవుడ్, కోలీవుడ్ నటులు ఈ కరోనా గురించి తమ స్టైల్లో సూచనలు... సలహాలు ఇస్తూ వచ్చారు. 

 

తాజాగా అనుష్క నటిస్తున్న నిశ్శబ్దం టీమ్ ఈ కరోనా వైరస్ గురించి ఓ వీడియో తయారు చేసి రిలీజ్ చేశారు.  ప్రభుత్వం చెప్పిన రూల్స్ కచ్చితంగా పాటించాలని, రోజుకి సగటున 8 సార్లు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, తప్పని సరిగా శానిటైజర్ వాడాలని సూచించారు.. ఎక్కువ జనాలు ఉన్న ప్రదేశంలో తిరగడం సాధ్యమైనంత వరకు మానివేయాలని అన్నారు. అంతే కాదు ఎవరైనా తుమ్మినా.. దగ్గినా.. సాద్యమైనంత దూరం ఉంటేనే మంచిదని అంటున్నారు.

 

కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని.. కనీస జాగ్రత్తలు పాటించడం మనందరి బాధ్యత అంటూ అనుష్క, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, దర్శకుడు హేమంత్ మధుకర్ తదితరులు తెలియచేశారు. కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది.  ఇటీవల నిశ్శబ్దం చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అనుష్క తో చిత్రాలు తీసిన దర్శకుడు ఆమె ను ఎంతగానో పొగిడిన విషయం తెలిసిందే.  అయితే ఏప్రిల్ 2 న ఈ చిత్రం రిలీజ్ చేయడం ఒకరకంగా డేరింగ్ స్టేప్ అని అంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో చాలా చిత్రాల షూటింగ్ క్యాన్సల్ చేసుకోవడం.. వాయిదాలు వేసుకోవడం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: