సెలబ్రెటీలపై గాసిప్స్ సర్వసాధారణమే.. అందులోనూ కాస్త పేరున్న సెలబ్రెటీలపై ఇవి ఇంకాస్త ఎక్కువ. యూట్యూబుల్లోనూ.. వెబ్ సైట్లలోనూ హీరో, హీరోయిన్లపైనా చాలా గాసిప్స్ వస్తుంటాయి. సదరు సెలబ్రెటీలు కూడా ఆ గాసిప్స్ ను సీరియస్ గా తీసుకోరు. నవ్వి వదిలేస్తుంటారు. అదో రకం పబ్లిసిటీలే అని ఊరుకుంటారు.

 

 

ఇలాంటి అనుభవమే యాంకర్ ప్రదీప్ మాచిరాజుకూ ఎదురైందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం స్వయంగా తానే బయటపెట్టాడు.. ఇప్పటి వరకూ మీరు బాగా నవ్వుకున్న గాసిప్‌ ఏంటి ? అని యాంకర్ అడిగితే.. ప్రదీప్ ఈ విషయం బయట పెట్టాడు. ఇప్పటివరకూ తనపై చాలా గాసిప్స్ వచ్చాయన్న ప్రదీప్ వాటిలో ఒకటి మాత్రం తనకు బాగా నవ్వు తెప్పించిందట.

 

 

ఇంతకీ ఆ గాసిప్ ఏంటో తెలుసా.. ప్రదీప్‌ పెళ్లయిందనీ.. ఆయకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని.. కానీ క్రేజ్ తగ్గుతుందని ప్రదీప్ వాళ్లను దాచాడనీ రాశారట. ఇది చూసి ప్రదీప్ చాలా నవ్వుకున్నాడట. అక్కకు లేక అటుకులు తింటుంటే, చెల్లి వచ్చి చికెన్‌ బిర్యానీ అడిగినట్టు అసలు పెళ్లే లేదంటే పిల్లలు ఎక్కడి నుంచి ఉంటారు చెప్పండి అంటూ సమాధానం చెప్పాడు. ఇలాంటవన్నీ చూసుకుని తాను నవ్వుకుంటానని.. మంచిదో చెడ్డదో పదిమంది మాట్లాడుకుంటున్నారు .. పోనీలే అని వదిలేస్తాననీ చెప్పాడు ప్రదీప్ మాచిరాజు.

 

 

ప్రదీప్ అంటే పెళ్లికాని వాడు కాబట్టి ఈ గాసిప్స్ ను లైట్ గా తీసుకుంటాడు.. ఆ గాసిప్ కూడా అలాంటిదే.. కానీ.. పెళ్లయిన వాళ్లపై వాళ్ల ప్రైవేటు లైఫ్ పై వచ్చే గాసిప్స్ మాత్రం మంచివి కావు. కొన్నిసార్లు ఇలాంటి గాసిప్స్ వల్లే కుటుంబాలు విడిపోయిన సందర్బాలూ ఉంటాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: