అనుష్క అలియాస్ స్వీటీ శెట్టి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. అందం అభినయంతో తెలుగు చిత్రం సీమలో ఎన్నో విజయాల్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అరుంధతి, బాహుబలి, బాహుబలి 2, రుద్రమదేవి, భాగమతి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అనుష్కకు ఏ రేంజ్‌లో అభిమానులు ఉన్నారో ప్ర‌త్యేకంగా లెక్క‌లు అక్క‌ర్లేదు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ కి ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా స్టార్ హీరోయిన్ అనుష్క స్థానం పదిలం గానే ఉంటుంది.

 

ఇక తెలుగు, తమిళ భాషలలో చిత్రాలలో కలిపి సుమారు 50కి పైగా చిత్రాల్లో ఆమె నటించారు. ఈ క్ర‌మంలోనే  ఆమె సినీ ప్ర‌స్థానానికి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. హీరోయిన్‌గా ఎంతో ఎత్తుకు ఎదిగినా ఆ తాలూకూ గ‌ర్వం ఏ మాత్రం ఆమె మాటల్లో, న‌డ‌త‌లో క‌నిపించ‌వు. అలాగే టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్‌గా మారింది. దీంతో హీరోయిన్ ఒరియంటెడ్ చిత్రాలు అలోచించే దర్శకులకు ముందు అనుష్కనే గుర్తుకు వస్తుంది. ఇక ప్ర‌స‌త్తం అనుష్క‌హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ మూవీ `నిశ్శబ్ధం` చిత్రంలో న‌టిస్తుంది.

 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తయ్యింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈటీవీ మోస్ట్ ఎంటర్టైనింగ్ షోలలో ఒకటైన క్యాష్ ప్రోగ్రాం కు స్పెషల్ గెస్ట్ గా అనుష్క‌ వచ్చినట్టు లేటెస్ట్ ప్రోమో ద్వారా తెలుస్తోంది. అతి త్వరలో టెలికాస్ట్ కాబోయే ఈ ఎపిసోడ్ కు మాత్రం ఖచ్చితంగా రికార్డు స్థాయి టీఆర్పీ రావడం ఖాయమ‌ని చెప్పాలి. కేవ‌లం ఇర‌వై సెకండ్లు మాత్రమే ఉన్న ఈ ప్రోమో అద్భుతంగా ఉంది. మ‌రి ఈ షో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: