మలయాళ కుట్టి యాంకర్ సుమ మొదట్లో సీరియల్స్, సినిమాలు చేసిన తర్వాత స్పషమైన తెలుగు యాంకర్ గా గుర్తింపు పొందింది. ఇటు రాజీవ్ క‌న‌కాల‌ను పెళ్లి చేసుకున్నాక సుమ తెలుగు బుల్లితెర రంగంపై దూసుకుపోయింది. ఇక స్టార్ మ‌హిళ సుమ జీవితాన్ని ఎలా ట‌ర్న్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ షోతో వ‌చ్చిన క్రేజ్ త‌ర్వాత తెలుగులో ఏ ఛానెల్ చూసినా.. ఏ షో చూసినా సుమ హంగామ‌నే క‌నిపించేది. ఇక భారీ సినిమాల ఆడియో వేడుకలకు, ఇంకా సినిమా అవార్డ్స్ ఫంక్షన్స్ కి ఒకే ఒక్క టాప్ యాంక‌ర్‌గా మారిపోయింది.

 

సుమ దెబ్బ‌తో మిగిలిన తెలుగు యాంక‌ర్స్ అంద‌రూ ప‌డిపోయారు. దీంతో త‌న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆమె భారీ రేట్లు డిమాండ్ చేస్తార‌న్న టాక్ కూడా ఇండ‌స్ట్రీ, బుల్లితెర రంగంలో ఉంది. ఆ త‌ర్వాత అన‌సూయ‌, ర‌ష్మి లాంటోళ్లు హాట్ ఇమేజ్‌తో పాపుల‌ర్ అయ్యారే గాని.. సుమ లాంటి హోమ్లీ ఇమేజ్ మాత్రం వాళ్ల‌కు రాలేదు. ఆ త‌ర్వాత ఏ యాంక‌ర్ వ‌చ్చినా హాట్ ఇమేజ్‌తోనే పాపుల‌ర్ అవుతున్నారు. సుమ ఎంత కాస్ట్ లీ రేటు చెపుతున్నా చాలా మంది మాత్రం ఆమెనే త‌మ ఫంక్ష‌న్ల‌కు తీసుకు వ‌స్తుంటారు.

 

ఇక సుమ ఈటీవి జీన్స్, క్యాష్ ప్రోగ్రామ్స్ తోనూ, మా టివి ప్రోగ్రామ్స్ తోనూ బాగా బిజీగా ఉండే సుమకి ఈమధ్యన ప్రోగ్రామ్స్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఈ డౌట్ ఇప్పుడు బుల్లితెర స‌ర్కిల్స్‌లో బాగా వైర‌ల్ అవుతోంది. ఎందుకంటే సుమ చాలా చెత్త షోల‌ను ఎంచుకుని వాటికి ఎందుకు యాంక‌రింగ్ చేస్తుందా ? అని కొంద‌రు చ‌ర్చించు కుంటున్నారు. ప్ర‌స్తుతం సుమ చేతిలో వైఫ్ చేతిలో లైఫ్ … అనే ప్రోగ్రాం మరీ బోరింగ్ గా ఉంది. అలాగే హౌస్ ఆఫ్ హంగామా అనే మ‌రో కొత్త షో మొద‌లైంది. ఇది కూడా చెత్త సీరియ‌ల్‌ను త‌ల‌పిస్తూ బోరింగ్‌గా ఉంద‌ని తెలుగు బుల్లితెర అభిమానులు అంటున్నారు.

 

ఈ షో వెకిలీ కామెడీతో చాలా బోరింగ్‌గా ఉందంటున్నారు. సుధా, హేమంత్ లాంటోళ్ళు ఆ షోలో ఉన్నా ఆ ప్రోమో మాత్రం చప్పగా ఉంది. సుమ ఇలాంటి వాటిల్లో చేయ‌డం ఆమె అభిమానుల‌కు న‌చ్చ‌డం లేదు. ఆమెకు  సినిమా ప్రోగ్రామ్‌లు త‌గ్గిపోవ‌డంతోనే ఇప్పుడు ఇలాంటి షోలు కూడా చేస్తుంద‌న్న సెటైర్లు నెటిజ‌న్ల నుంచి వ‌స్తున్నాయి. మ‌రి సుమ ఏం ఆన్స‌ర్ చేస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: