కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ 160 దేశాలకు పాకింది. జనాల ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే కాదు ఆర్ధికంగాను అన్ని దేశాలు సంక్షోభంలో పడిపోతున్నాయి. అసలే ఆర్ధికంగా సంక్షభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు కరోనా ఎఫెక్ట్ ఇంకా దిగజార్చుతోంది. అన్ని పరిశ్రమల తో పాటు చిత్ర పరిశ్రమను కరోనా ఊబిలోకి లాగేసింది. హాలీవుడ్ తో పాటు భారతీయ సినిమాల మీద కూడా కరోనా వైరస్ విపరీతంగా ప్రభావం చూపిస్తుంది. దాంతో హాలీవుడ్ సినిమాలకు కరోనా ఎఫెక్ట్ దారుణంగా పడింది. ఈ నేపథ్యంలోనే అవతార్-2కి కరోనా దెబ్బ గట్టిగానే తగిలింది. అవతార్ ఫ్రాంఛైజీ నుంచి మరిన్ని సీక్వెల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ నేపథ్యంలోనే అవతార్సినిమాకి మొత్తం నాలుగు సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే అవతార్-2 చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.  ఒక వైపు ఫ్రాంఛైజీలో తదుపరి భాగాల షూటింగ్ లు కొనసాగిస్తూనే.. మరో వైపు అవతార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే చిత్రీకరణ సహా పోస్ట్ ప్రొడక్షన్ ని భాగంగా న్యూజిలాండ్ లో చేయాల్సి ఉండగా కరోనా దెబ్బకి ఏ పనులు ముందుకు కదలడం లేదని కామోరూన్ తాజాగా వెల్లడించారు.  

 

న్యూజిలాండ్ లో అన్ని రోడ్లు బ్లాక్ అవడంతో అవతార్-2 సినిమాకు సంబంధించిన మార్కెట్ పైనే ఈ ప్రభావం ఎక్కువగా పడుతుందని హాలీవుడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను అన్ని పనులు పూర్తిచేసి ఈ ఏడాది విడుదల చేయాలని కామోరూన్ అనుకున్నారు. కానీ కరోనా తో తాజా పరిస్థితులను చూస్తుంటే ఈ ఏడాది సినిమా అవతార్ 2 విడుదలవ్వడం అసాధ్యమని సమాచారం. మిగతా భాగాలను వరుసగా 2023..2025..2027లోరిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ కరోనా దెబ్బకి అవతార్ ఫ్రాంఛైజీ మొత్తం తారుమారైంది. ఈ లెక్కన చూస్తుంటే అర్థమవుతుంది కరోనా ఎఫెక్ట్ ఎంతగా ప్రభావం చూపిస్తుందో. దీని ప్రభావం టాలీవుడ్ లో అల్లరి నరేష్ సినిమాకైనా హాలీవుడ్ లో జేంస్ కామోరూన్ తెరకెక్కించే అవతార్ కైనా ఒకేలా ఉంటుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: