ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకే నీరు పారదు. పాత నీరు పోతూ ఉంటే కొత్త నీరు వస్తూనే ఉంటుంది. అయితే వాళ్ళలో ఎంతమంది సక్సస్ అవుతారో ఆ సక్సస్ ని ఎంతమంది కాపాడుకుంటారో కూడా తెలిసిందే. అయితే కొంతమంది హీరోల మధ్య గాని హీరోయిన్స్ మధ్య గాని ఇతర నటీనటుల మధ్య గాని ఉండే పోటీ నిజంగా వాళ్ళని స్టార్ గానే తీర్చి దిద్దుతుంటుంది. ఇక గత కొంతకాలంగా బుల్లి తెరమీద ప్రసారమవుతున్న సీరియల్స్ గాని డాన్స్ షోలు గాని, రియాలిటి షోస్ గాని, కామెడీ షోస్ గాని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రోగ్రాంస్ లో పార్టిసిపేట్ చేస్తున్న టీం లీడర్స్ గాని ఆ టీం లో ఉన్న టీం మెట్స్ గాని బాగా క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. 

 

ఇక 'జబర్దస్త్' ఖతర్నాక్ కామెడీ షోతో హైపర్ ఆదీకి ఎంతపేరు వచ్చిందో అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ఆది పంచ్‌లు, టైమింగ్‌ తో ప్రేక్షకులను ఫిదా చేయడమే కాదు ఒక సినిమా హీరోకి ఉన్నంత క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకూ ఛానల్స్ లో ప్రసారమవుతున్న కామెడీ షోలు ఏవీ కూడా ఆది ని ఢీ కొట్టలేకపోయాయి. ఇక రీసెంట్ గా ఆది యాంకర్‌గానూ అందరిని బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అంతేకాదు ఇప్పట్లో ఆదిని కొట్టేవాడు ఎవడూ లేడని ఆది తో పాటు అందరూ అనుకున్నారు.

 

కాని సద్దాం రంగంలోకి దిగి ఆదికి చుక్కలు చూపిస్తున్నాడు. 'పటాస్' తో సద్దాం తన కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆదికే పోటీ వస్తాడని ఎవరూ అనుకోలేదు. పటాస్ లో చెలరేగిపోయాడు. కాని ఆ షో నుంచి బయటికొచ్చి జబర్దస్త్‌తో పాటు ఇంకొన్ని షోలు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే 'అదిరింది' షో తో జబర్దస్త్ నుంచి సీనియర్ కమెడియన్స్, కంటెస్టెంట్స్ కూడా సద్దాం స్కిట్ చూసి కుళ్ళుకునేలా రెచ్చిపోతున్నాడు.

 

మొదట 'జబర్దస్త్' వర్సెస్ 'అదిరింది' అనే పరిస్థితులు ఉన్నప్పటికీ  అదిరింది అంతగా ఆకట్టుకోలేదు. కాని రాను రాను సద్దాం ఆదికి గట్టిగా పోటీ ఇస్తున్నాడు. కరెక్ట్ గా చెప్పాలంటే 'జబర్దస్త్‌' లో హైపర్ ఆదీ ఎలాగో.. 'అదిరింది' లో సద్దాం టీమ్ అలా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ టీవీ ముందు నుంచి కదలనివ్వడం లేదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆదీ స్కిట్‌లనే తుడిచిపెట్టేస్తున్నాడు సద్దాం. 

 

 సద్దాం డైలాగ్స్.. పంచ్‌లు, టైమింగ్ ఆది స్కిట్  ని బాగా డామినేట్ చేస్తున్నాయి. ఆదిలా కాకుండా సద్దాం టీమ్‌లో ఉన్న అందరికీ సమన్యాయం చేస్తూ ఎవరికిచ్చే డైలాగ్ వాళ్లకిస్తూ టీమ్ లీడర్‌గా తన నిజాయితీని చాటుకుంటున్నాడు. దాంతో అందరూ సద్దాం స్కిట్ లో కి రావాలని ఆరాటపడుతున్నారు. దీంతో జనాలు చాలామంది ఆది మాస్ డైలాగ్స్ లాగే ఆదికి మొగుడులా సద్దాం తయారయ్యాడు .. ఆదికి ఇక చుక్కలే అంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: