మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీరిద్దరిది క్రేజీ కాంబినేషన్ అని చెప్పాలి. జులాయి సినిమా లో  కొడుకులోని జులాయి తనం చూపించినా, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో ఒక భాధ్యత కలిగిన కొడుకుగా కుంటుంబానికి ఆసరాగా నిలవడం చూపించినా త్రివిక్రమ్ కే చెల్లింది. త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ కొంచెం స్పెషల్ గా ఉంటాయని చెప్పాలి. టైటిల్ లోనే ఇంచుమించుగా హీరో క్యారెక్టర్ నీ చూపిస్తాడు త్రివిక్రమ్. ముఖ్యంగా బన్నీ కెరీర్ లో అతనితో చేసిన మూడు సినిమాలు కూడా మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. 

 

జులాయి సినిమా లో తెల్లారకుండానే కోడి లేస్తది అయితే ఏంటి ప్రయోజనం కూర వండుకుని తినేస్తున్నం అంటూ తండ్రితో వెటకారమైన, సత్యమూర్తి చిత్రంలో పరిస్తితి బావున్నప్పుడు విలువలు, బాలేనప్పుడు డబ్బులు మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పించినా ఈ మాటల మాంత్రికుడికే చెల్లింది. తన డైలాగ్ లను బన్నీ తో చెప్పించే విధానం సినిమాను ఒక రేంజ్ కి తీసుకెళ్తుంది అని ఆయన అభిమానులు అంటున్నారు. వీరి కాంబినేషన్లో ఈ మధ్య రిలీజ్ అయిన మరో చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ఈ సినిమా మంచి హిట్ ను అందించింది. 


మరొక్కసారి త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ నుంచి మంచి సినిమా కోరుకున్న ప్రేక్షకులకు కావల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందించింది ఈ చిత్రం. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు మంచి మార్కులు వచ్చాయి. కథ పరంగా చూస్తే కూడా ఇటు ఫ్యామిలీ ఆడియన్స్, అటు యూత్ కు ఈ సినిమా బాగా నచ్చింది. ఎప్పటిలాగే వీరి కాంబినేషన్లో మరో హిట్ ను అందుకుంది. ఈ సినిమా భారీ వసూళ్ళు సాధించింది. టాలీవుడ్ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది. బన్నీ కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయి. ఇలా ఈ ఇద్దరూ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: