పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఇద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే? త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పవన్ కళ్యాణ్ ఎంత విలువ ఇచ్చాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. 

 

త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ సినిమాలే కాదు.. రాజకీయంగానూ మంచి సపోర్ట్ ఉంది. మొదట్లో పవన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లేవాడు. ఇంకా చెప్పాలి అంటే? త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ ప్రజల ముందు ఇచ్చే స్పీచ్ లో డైలాగులు రాయించేవాడు అని సోషల్ మీడియాలో ఇప్పటికి గాసిప్స్ వినిపిస్తాయి. 

 

అంతేకాదు.. పవన్ కళ్యాణ్ ను ఇండస్ట్రీలో ఎవరైనా కలవాలి అంటే త్రివిక్రమ్ ఒక్కడే మార్గం అంట.. అంత బలంగా వీరి బంధం ఉండేదట. ఆ బంధం వల్లే పవన్ కళ్యాణ్ కు మిగితా డైరెక్టర్లు దూరం అయ్యారు అని ఒక టాక్ ఉంది. మరి ఆ టాక్ లో ఎంత నిజం ఉంది అనేది కొందరికే తెలుస్తుంది. 

 

రాజకీయాల్లో ఎంత బిజీ ఉన్న.. పవన్ కళ్యాణ్ మాత్రం త్రివిక్రమ్ ను బయట కలిసేవాడట.. అసలు ఎందుకు ఇంత ప్రేమలు.. స్నేహాలు వీళ్లకు అని అనుకుంటున్నారా? అసలు ఈ బంధం వెనుక రహస్యం ఏంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. అసలు వీళ్ళ బంధం వెనుక అసలు రహస్యం ఏంటి అంటే? 

 

పవన్ కళ్యాణ్ కు చదువు లేదు.. కానీ అయన వేల పుస్తకాలు చదివేసారు.. త్రివిక్రమ్ కే అవసరం లేనంత చదువు ఉంది. అందుకే త్రివిక్రమ్ అంటే పవన్ కళ్యాణ్ కి ఇష్టమట. ఓ కార్యక్రమంలో కూడా పవన్ త్రివిక్రమ్ ని ఓ రేంజ్ లో పొగిడేశారట..  త్రివిక్రమ్ అంటే ఓ సినిమా దర్శకుడిగానే అందరికీ తెలుసని... కానీ ఆయన ఒక అత్యున్నత విద్యావంతుడని ఎవరికి తెలియదు అని న్యూక్లియర్ ఫిజిక్స్ లో త్రివిక్రమ్ ఎమ్మెస్సీ చేశారని... యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్ కూడా అని పవన్ అప్పట్లో తెలిపారట. వీరిద్దరి మధ్య సినిమాలే కాదు చదువు కూడా ఒక కారణం అని అప్పట్లో ఓ రేంజ్ లో వార్తలు వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: