మార్చి చివరలో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఏప్రిల్ లో సినిమాలదీ ఇదే తంతు. ఇక మే రిలీజెస్ పరిస్థితి ఏంటన్న డౌట్ వస్తోంది. రెండు నెలల తర్వాత రిలీజయ్యే సినిమాల గురించి ఇప్పుడు ఎందుకంటే.. సమ్మర్ లో వచ్చే ఏకైక స్టార్ మేలోనే వస్తున్నాడు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ పై కూడా కారు మబ్బులు కమ్ముకున్నాయి. 

 

సమ్మర్ లోవస్తున్న ఏకైక స్టార్ హీరో పవన్ కళ్యాణ్. రెండేళ్ల విరామం తర్వాత నటిస్తున్న సినిమా వకీల్ సాబ్. హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ కు రీమేక్ గా రూపొందుతోంది. ఎంసీఏ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షూటింగ్ ఈ మధ్యనే మొదలుపెట్టినా.. పవన్ కళ్యాణ్ సినిమా ఆద్యంతం కనిపించడు. 20రోజుల షూటింగ్ తో ఆయన పార్ట్ పూర్తవుతుంది. ఒరిజినల్ వెర్షన్ లో అమితాబ్ పోషించిన లాయర్ రోల్ పోషిస్తున్నాడు పవన్ కళ్యాణ్.

 

వకీల్ సాబ్ పై కరోనా మబ్బులు కమ్ముకున్నాయి. ఈ నెల 21 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉండగా.. దేశమంతా షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో వకీల్ సాబ్ బ్యాలెన్స్ వర్క్ ఇప్పట్లో పూర్తయ్యేటట్టు కనిపించడం లేదు. వకీల్ సాబ్ అనే కాదు.. ఏ సినిమా షూటింగ్ అయినా.. కరోనా ప్రభావంపై ఆధారపడి ఉంది.

 

వకీల్ సాబ్ షూటింగ్ మొదలు కాగానే.. మే 15న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత ఎనౌన్స్ చేశాడు. బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ ను ఈ నెలలో కాకపోయినా.. ఏప్రిల్ లో ఫినిష్ చేసినా మే 15న రిలీజ్ చేసే అవకాశం ఉందట. కరోనా ప్రభావం తగ్గకపోతే.. ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఏకైక స్టార్ మూవీ వకీల్ సాబ్ కూడా వాయిదా పడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: