బుల్లితెర యాంకర్ రవి గురించి అందరికి తెలిసిందే. తన మార్క్ యాంకరింగ్ తో అలరిస్తూ వస్తున్న రవికి స్మాల్ స్క్రీన్ పై సూపర్ క్రేజ్ ఉంది. ప్రదీప్ ఫామ్ లోకి వచ్చే వరకు రవి హంగామా నడిచింది. రవి ఏ షో చేసినా చాలా ఎనర్జిటిక్ గా చాలా యాక్టివ్ గా చేస్తాడు. తన కామెడీ టైమింగ్, పంచులు బాగా పండుతాయి. అయితే ఏమైందో ఏమో కానీ సడెన్ గా యాంకర్ రవి కూడా ఏడిపించడం మొదలుపెట్టాడు. రవి ఏడిపించడం ఏంటి అని ఆశ్చర్యపోవచ్చు.. జీ తెలుగులో ఉగాది కానుకగా ఈ ఆదివారం రాబోతున్న బాబు గారింట్లో బుట్ట భోజనం షోలో రవి తన కూతురుతో ఓ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 

 

చిన్నారి తల్లి అంటూ తన కూతురుతో డ్యాన్స్ వేసిన రవి చివరకు చాలా ఎమోషనల్ గా మారాడు. తాను లేచేలోపే షూటింగ్ కు వస్తానని.. ఇంటికి వెళ్లే సరికి పాప పడుకుంటుంది.. తనని దగ్గరకు తీసుకుందామని అనుకున్నా రాదనీ ఎమోషనల్ అయ్యాడు రవి. ఇన్నాళ్లు సరదాగా కనిపించిన రవి ఇలా ఎమోషనల్ గా కన్నీరు పెట్టుకోవడం అందరిని ఆశ్చర్యపరచింది. బుల్లితెర మీద మేల్ యాంకర్స్ గురించి చెబితే అందులో రవి పేరు కూడా ఉంటుంది. రవి చేసిన ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ ప్రోమోలోనే ఇంత అందంగా ఉంటే ఇక పాట మొత్తం ఇంకెలా ఉంటుందో చూడాలి. 

 

రవి తర్వాత వచ్చిన ప్రదీప్, సుధీర్, ఆది వీళ్ళు కూడా యాంకర్స్ గా దూసుకెళ్తున్నారు. అయితే రవి మాత్రం ఇప్పటికి తన మార్క్ చూపిస్తున్నాడు. ఈమధ్యనే తన పర్సనల్ లైఫ్ ను ప్రపంచానికి పరిచయం చేసిన రవి లోపల ఇంత ఎమోషన్ ఉందని ఈ ప్రోగ్రామ్ ద్వారానే తెలిసింది. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: