ఈ మద్య ప్రపంచ దేశాలను భయపెడుతున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత దేశంలో కూడా హడలెత్తిస్తుంది.  ముఖ్యంగా కరోనా వైరస్ వల్ల జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడే వారు ఈ వైరస్ ప్రభావం ఉన్నట్లే అంటున్నారు డాక్టర్లు.. వారు వెంటనే ఆసుపత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకోవాలని అంటున్నారు.  తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం చూపిస్తుందంటున్నారు.  కేరళా, మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.   

 

 

ఈ నేపథ్యంలో పాఠశాలలు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, క్లబ్బులు  అన్నీ 31 వరకు ముసి వేశారు.  తాజాగా కాంగ్రెస్ మహిళా నేత, నటి విజయశాంతి కరోనా వైరస్ పై సీరియస్ గా వ్యాఖ్యానించారు.  తెలంగాణలో కరోనా లేదని ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.. కానీ నిజాలు దాస్తే దాగవని అన్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్టంలో కరోనా కేసులే లేవన్న ముఖ్యమంత్రి మాత్రం ప్రగతి భవన్ నుంచి తప్పించుకుని గజ్వేల్ ఫాం హౌస్‌లో సేద తీరుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా వైరస్ గురించి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంత సీరియస్ గా వ్యవహరిస్తున్నారో తెలిసిందే. 

 

 అయితే మన ముఖ్యమంత్రి మాత్రం తాపీగా ఫామ్ హౌజ్ లో కూర్చొని పర్యవేక్షణ చేస్తున్నారని అంటున్నారు. మరి హైదరాబాద్‌లోని సామాన్యులు ఎక్కడికి వెళ్లాలని విజయశాంతి ప్రశ్నించారు. ఆ విషయాన్ని కేసీఆరే చెబితే బాగుంటుందని అన్నారు.  జనసంద్రంగా ఉన్న ప్రదేశాల్లో ఈ కరోనా వస్తుందని అంటున్నారు.. మరి హైదరాబాద్ లో జనాలు బాగానే ఉంటున్న విషయం ఆయనకు తెలిసిందో లేదో.. మరి నగరంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారి అధికారులతో మాట్లాడారా.. నగర వాసులు ఎలా ఉన్నారని ఆరా తీస్తున్నారా ? అని ప్రశ్నించారు. తెలంగాణలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయని, హైదరాబాద్‌లోనూ ఈ సమస్య ఉందని అన్నారు. కరోనా సమస్య ఒక్క హైదరాబాద్‌లోనే ఉందని, జిల్లాల్లో ఉండదని చెప్పిన కేసీఆర్ తన భద్రత కోసం ఫాంహౌస్‌కు వెళ్లిపోయారని ప్రజలు చర్చించుకుంటున్నారని విజయశాంతి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: