ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ సొంతం చేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ. నాగార్జున హీరోగా తెరకెక్కిన శివ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వర్మ ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. తరువాత వరుసగా సూపర్ హిట్ సినిమాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న వర్మ బాలీవుడ్ బాట పట్టాడు. బాలీవుడ్‌లోనూ వర్మ ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది.

 

రంగీల సినిమాతో బాలీవుడ్‌ ను షేక్‌ చేసిన వర్మ తరువాత సత్య, కంపెనీ, దౌడ్‌, మస్త్‌ లాంటి సినిమాలతో అక్కడ కూడా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. అదే జోరులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ ప్రధాన పాత్రలో సర్కార్‌ సినిమాను రూపొందించాడు వర్మ. తన ఫేవరెట్ సినిమా గాడ్‌ ఫాధర్‌ ఇన్సిపిరేషన్‌తో అమితాబ్, అభిషేక్‌, ఐశ్వర్య రాయ్‌ కాంబినేషన్‌లో ఈ పొలిటికల్ క్రైమ్‌ డ్రామాను రూపొందించాడు.

 

సినిమా ఘన విజయం సాధించటంతో వర్మ ఇమేజ్‌ తారాస్థాయికి చేరింది. అంతేకాదు సెకండ్ ఇన్నింగ్స్‌ లో అప్పటి వరకు తనకు భారీ సక్సెస్ లేకపోవటంతో సర్కార్‌ హిట్‌ తో వర్మ అంటే ఎంతో అభిమానాన్ని పెంచుకున్నాడు బిగ్ బీ. అందుకే తరువాత వర్మతో సినిమా అంటే కథ కూడా వినకుండానే ఓకే చేశాడు. ఆ నమ్మకంతోనే వివాదాస్పద కథతో రూపొందిన నిశ్శబ్ధ్ లాంటి సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా కూడా అమితాబ్ కెరీర్‌కు ప్లస్ అయ్యింది.

 

అయితే వర్మ తెరకెక్కించిన ఆగ్ ఈ సినిమా వారిద్దరికీ షాక్‌ ఇచ్చింది. అమితాబ్ నెగెటివ్‌ రోల్‌ లో తెరకెక్కిన షోలే రీమేక్‌ ఆగ్ డిజాస్టర్ కావటంతో ఈ కాంబినేషన్‌ మీద అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే అమితాబ్ మాత్రం వర్మతో తన రిలేషన్‌ను కటింన్యూ చేశాడు. తరువాత కూడా వర్మతో కలిసి సినిమాలు చేసేందుకు ఓకే చెప్పాడు వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: