టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సినిమాల్లో మహేష్ బాబు హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమా ఒకటి. టాలీవుడ్ లో ఎన్నో రికార్డ్స్ ని ఈ సినిమా బ్రేక్ చేయడమే కాకుండా అప్పటి వరకు క్లాస్ ఆడియన్స్ కి మాత్రమే దగ్గరైన మహేష్ బాబుని మాస్ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా దగ్గర చేసింది. మహేష్ బాబు ఈ సినిమా తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా అమ్మాయిలకు మాత్రం ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉండాలి అనే విధంగా అతను పాపులర్ అయిపోయాడు. 

 

పూరి జగన్నాథ్ కెరీర్ లో కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు సాఫ్ట్ గా కనిపించిన మహేష్ బాబుని కాస్త దూకుడుగా చూపించాడు. ముఖ్యంగా కథను పూరి మలిచిన విధానం... మహేష్ బాబు నటనకు సినిమాలో ఇచ్చిన ప్రాధాన్యత, కొన్ని సీన్స్ ని తెరకెక్కించిన విధానం అన్నీ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతీ సీన్ కూడా సినిమా లో ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటుంది. ఆ సినిమా అప్పుడు భారీ వసూళ్లు సాధించింది. 

 

ఇక హీరోయిన్ ఇలియానా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రేమ సన్నివేశాలను కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రతీ నటుడు కూడా ఈ సినిమాలో చాలా జాగ్రత్తగా నటించాడు. ముఖ్యంగా మహేష్ బాబు నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. యాక్షన్ సన్నివేశాల్లో అప్పటి వరకు మహేష్ లో చూడని యాంగిల్ ని చూపించాడు. దీనితో సినిమా ఊహించని విధంగా హిట్ అయింది. క్లైమాక్స్ సీన్ లో మహేష్ ని చూపించిన విధానానికి అభిమానులు జేజేలు కొట్టారు. ఇలా ఈ సినిమాతో మహేష్ బాబు, పూరి బెస్ట్ కాంబో అనిపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: