సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం ఒక సమస్యగా గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉంది. ఈ లిస్టులో అందరికంటే ముందు వరసలో బాలయ్య ఉంటాడు. బాలయ్య బోయపాటిల మూవీకి హీరోయిన్ ను ఫిక్స్ చేయడానికి బోయపాటి పడిన పాట్లు వర్ణనా తీతం. ప్రస్తుతం పెద్దగా క్రేజ్ లో లేని తమన్నా కూడ బాలకృష్ణ తో నటించాలి అంటే పెట్టిన కండిషన్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 


ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు హీరోయిన్స్ సమస్య చిరంజీవి పవన్ లాంటి టాప్ మెగా హీరోలకు ఏర్పడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఒకప్పుడు చిరంజీవి పక్కన అవకాశం ఇస్తే చాలు అని క్యూ కట్టే హీరోయిన్స్ ఇప్పుడు చిరంజీవి విషయంలో ఒక వైపు గౌరవం ప్రదర్శిస్తూనే మరొక వైపు పెడుతున్న కండిషన్స్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి. ‘ఆచార్య’ మూవీలో త్రిష తప్పుకోవడంతో ఆ స్థానాన్ని అనుష్క తో సరిపెట్టాలి అని చేస్తున్న ప్రయత్నాలకు ఇంకా పూర్తి అంగీకారం అనుష్క నుంచి రాలేదు అని అంటున్నారు. 


పవర్ స్టార్ గా లక్షల మంది అభిమానులు కలిగిన పవన్ కళ్యాణ్ పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. ‘వకీల్ సాబ్’ మూవీలో పవన్ పక్కన నటించడానికి ముందుగా అంగీకరించిన శృతి హాసన్ యూటర్న్ తీసుకోవడంతో చేసేది లేక లావణ్య త్రిపాఠి తో సరిపెట్టుకోవలసి వస్తోంది. ఇక క్రిష్ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న భారీ బడ్జెట్ మూవీలో పవన్ పక్కన నటించడానికి కీర్తి సురేశ్ కియారా అద్వాని జాక్విలిన్ వాణి కపూర్ లాంటి క్రేజీ బ్యూటీలు ముందు ఒప్పుకున్నట్లుగా సంకేతాలు ఇచ్చి చివరి నిముషంలో డ్రాప్ అవుతున్నారు. 


ఇలా హీరోయిన్స్ చిరంజీవి పవన్ లకు ఊహించని విధంగా ఎందుకు జర్క్ ఇస్తున్నారు అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. ఈ క్రేజీ బ్యూటీలు అడుగుతున్న భారీ పారితోషికం ఇవ్వడానికి పవన్ సినిమా నిర్మాతలు ముందుకు వస్తున్నా చివరిలో డేట్స్ ఎడ్జెస్ట్ కావడం లేదు అంటూ తప్పుకోవడం లాంటి విషయాలు పరిశీలిస్తున్న ఇండస్ట్రీ వర్గాలు మాత్రం మెగా బ్రదర్స్ పేరు చెపితే హీరోయిన్స్ తల పట్టుకుంటున్నార అంటూ కొంతమంది మెగా కాంపౌండ్ వ్యతిరేకులు జోక్స్ వేసుకుంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: