టాలీవుడ్ సినిమాతో పరిచయం ఇప్పుడు జాతీయ స్థాయిలో టాప్‌ డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. స్టూడెంట్ నెంబర్‌ 1 సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రాజమౌళి, ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. బాహుబలి సినిమా తో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం భారీ మల్టీస్టారర్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ లు హీరోలుగా నటిస్తున్నారు.

 

అయితే ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్‌ కూడా చూడని రాజమౌళి మీద ఓ అపవాదు కూడా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేసిన హీరోలు తరువాత ఫ్లాప్‌ను ఎదుర్కొంటున్నారు. తొలి సినిమా నుంచి రాజమౌళి హీరోలకు ఈ సెంటిమెంట్‌ తప్పటం లేదు. తొలి స్టూడెంట్ నంబర్‌ 1లో హీరోగా నటించిన ఎన్టీఆర్‌కు ఆ తరువాత సుబ్బు సినిమాతో భారీ డిజాస్టర్ ఎదురైంది. తరువాత కూడా ఎన్టీఆర్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. రాజమౌళి దర్శకత్వంలో నటించిన సింహాద్రి సినిమా తరువాత ఆంధ్రావాలా, యమదొంగ సినిమా తరువాత కంత్రీ సినిమాలు భారీ డిజాస్టర్‌ లుగా నిలిచాయి.

 

మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న రామ్‌ చరణ్‌  ఆ తరువాత వెంటనే ఆరెంజ్‌తో భారీ డిజాస్టర్‌ను చవిచూశాడు. ప్రభాస్‌కు ఛత్రపతి తరువాత పౌర్ణమీ, బాహుబలి తరువాత సాహో సినిమాలు చేదు అనుభవాన్ని ఇచ్చాయి. వీళ్లే కాదు రవితేజకు విక్రమార్కుడు తరువాత ఖతర్నాక్‌, సై తరువాత నితిన్‌కు అల్లరి బుల్లోడు సినిమాలు డిజాస్టర్ రుచిచూపించాయి. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు సినిమా చేస్తుండటంతో వీళ్లకు కూడా నెక్ట్స్ ప్లాప్‌ తప్పదని భావిస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: