యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ - కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్ కు ఒక‌ప్పుడు మంచి క్రేజ్ ఉండేది. వీరి కాంబోలో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బాల‌య్య - బి.గోపాల్ కాంబినేష‌న్‌కు అలాంటి క్రేజ్ వ‌చ్చింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ఏకంగా నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లున్నాయి. అందులో రెండు ఇండ‌స్ట్రీ హిట్లు ఉన్నాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బాల‌య్య‌కు తిరుగులేని హిట్లు ఇచ్చిన ఘ‌న‌త బోయ‌పాటి శ్రీనుకే దక్కుతుంది. ముందుగా వీరి కాంబోలో 2010లో వ‌చ్చిన సింహా సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. బాల‌య్య స‌ర‌స‌న న‌య‌న‌తార‌, స్నేహ ఉల్లాల్ హీరోయిన్లుగా న‌టించారు.



ఇక మ‌ళ్లీ నాలుగేళ్ల‌కు 2014 ఎన్నిక‌ల టైంలో వ‌చ్చిన లెజెండ్ సినిమా బాల‌య్య‌కు సూప‌ర్ హిట్ ఇవ్వ‌డంతో పాటు నాడు తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఈ సినిమా మంచి జోష్ నింపింది. ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీకి ఎన్నిక‌ల వేళ లెజెండ్ మంచి బూస్ట‌ప్ ఇచ్చింది అన‌డంలో సందేహం లేదు. ఆ ఎన్నిక‌ల టైంలోనే బాల‌య్య తొలిసారిగా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లోకి ఎంట్రీ ఇచ్చి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు.


బాల‌య్య ప‌ని అయిపోయింద‌ని ప్ర‌తిసారి విమ‌ర్శ‌లు చేసే బాల‌య్య - బోయ‌పాటి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండూ సూప‌ర్ హిట్లు అవ్వ‌డంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌కు మంచి క్రేజ్ ఉంది. దీంతో ఇప్పుడు బాల‌య్య మ‌ళ్లీ స‌రైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మ‌ళ్లీ బాల‌య్య - బోయ‌పాటి కాంబినేష‌న్లో సినిమా వ‌స్తోంది. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీంతో ఇప్పుడు విమ‌ర్శ‌కులు మ‌ళ్లీ సైలెంట్ అయ్యారు.



సినిమా క‌థ‌లో ద‌మ్ముంటే బాల‌య్య మార్కెట్ మ‌ళ్లీ పుంజుకుంటుంద‌ని.. బాల‌య్య ప‌నైపోయింద‌ని విమ‌ర్శ‌లు చేసే వాళ్ల నోళ్ల‌కు మ‌ళ్లీ తాళం ప‌డుతుంద‌ని బాల‌య్య అభిమానులు.. నంద‌మూరి అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: