రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొమరం భీంగా ఎన్టీఆర్ కనిపిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నిజ జీవిత పాత్రలతో కల్పిత కథని చెబుతున్నాడు రాజమౌళి. స్వాతంత్ర్యం రావడానికి ముందు 1920 లో జరిగే ఈ కథని రాజమౌళి అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం.

 


అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి సంవత్సరానికి పైగానే అయింది. మొదట్లో ఎన్టీఆర్ జోడీగా తీసుకున్న హీరోయిన్సినిమా నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ ని తీసుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ఆలియాభట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆమె షూటింగ్ లో పాల్గొన్నది లేదు. ఆమెకి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల డేట్లు ఇవ్వలేకపోతుంది.

 


తాజాగా ఏప్రిల్ నెలలో ఆమె డేట్లు ఇచ్చినప్పటికీ కరోనా వల్ల అది కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆమె డేట్లు ఇచ్చినపుడు సినిమా చేయాలంటే చాలా టైమ్ పట్టేలా కనిపిస్తుంది. అందుకనే ఆలియాని మార్చే ఆలోచనలో చిత్ర బృందం ఆలోచిస్తుందని సమాచారం అందుతోంది. ఆలియా డేట్స్ కోసం చూస్తే సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యం అవుతుందన్న నేపథ్యంలో ఈ విధంగా ఆలోచిస్తున్నారని టాక్.

 

 

ఆ ఆలస్యం రిలీజ్ మీద పడుతుందని, అందువల్ల ఆలియాని మార్చి వేరే హీరోయిన్ చూసుకుంటే బాగుంటుందేమో అని చూస్తున్నారట. ఇది నిజమా కాదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మరి ఆర్.ఆర్.ఆర్ విడుదల ఆలస్యం కాకుండా ఉండేందుకు రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: