తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్లకు కొదవ లేదు. ముఖ్యంగా ఓ హీరో, దర్శకుడు హిట్ కొడితే వారి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వస్తాయి. అలా హిట్ కాంబినేషన్లలో ఒకటిగా నలిచారు బాలకృష్ణ – కోడి రామకృష్ణ. ఎనభైల్లో వీరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో సింహభాగం హిట్లే. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు తీసింది ఒకే నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి. ఆ విధంగా చూస్తే ఇది ముగ్గురి కాంబినేషన్ అనే చెప్పాలి.

 

 

బాలయ్యతో కోడి రామకృష్ణ తీసిన మంగమ్మగారి మనవడు సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్. వీరి కాంబోలో వచ్చిన అతి పెద్ద హిట్ గా నిలిచింది. ప్లాటినమ్ జూబ్లీగా 565 రోజులు ఆడింది ఆ సినిమా. మంగమ్మగా భానుమతి నటన, కథనం సినిమాకు హైలైట్. తర్వాత వచ్చిన ముద్దుల గోపాలుడు, మువ్వగోపాలుడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు.. సినిమాలన్నీ హిట్లే. వీటిలో 1988లో వచ్చిన ముద్దుల మావయ్య సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఇవన్నీ కూడా భార్గవ్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎస్.గోపాల్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కించినవే. అన్ని సినిమాలు కూడా పల్లెటూరి నేపథ్యంలో వచ్చినవే. అప్పట్లో బాలకృష్ణ సినిమా అంటే కోడి రామకృష్ణే దర్శకుడు అనేంతగా పేరు వచ్చింది.

 

 

తర్వాత కాలంలో బాలకృష్ణకు మరికొంత మంది దర్శకులు కలిసొచ్చినా బాలయ్య అభిమానులకు మాత్రం భార్గవ్ ఆర్ట్ పిక్చర్స్, కోడి రామకృష్ణ ప్రత్యేకం. ఈ ముగ్గురి కాంబోకి మరో అత్యద్భుతమైన కలయిక అంటే హీరోయిన్ అనే చెప్పాలి. ఈ సినిమాలన్నింటిలో మంగమ్మగారి మనవడు సినిమా తప్పించి అన్ని సినిమాల్లోనూ హీరోయిన్ గా విజయశాంతి నటించింది. ఇటువంటి అరుదైన ఘటన మరే హీరోకు కూడా లేదు. అరుదైన కాంబినేషన్లు. హిట్లతో వీరి కాంబినేషన్ ఎంతో ప్రత్యేకం.

మరింత సమాచారం తెలుసుకోండి: