ఒక సినిమా హిట్ అవడానికి చాలా కారణాలు చెప్పొచ్చు. స్టార్ హీరో, స్టార్ డైరక్టర్ కాంబో కూడా అందుకు కారణం అవుతుంది. స్టార్ హీరో, క్రేజీ డైరక్టర్ ఇద్దరు కలిసి చేస్తే ఆ సినిమా పక్కా హిట్ అన్నట్టే లెక్క. డైరక్టర్, హీరో కాంబో మీద కూడా ఆడియెన్స్ అంచనాలు ఉంటాయి. ఆల్రెడీ ఫామ్ లో ఉన్న డైరక్టర్ అయితే ఇక ఆ అంచనాలు భారీ రేంజ్ లో ఉంటాయి. టాలీవుడ్ లో ఇప్పటివరకు క్రేజీ కాంబినేషన్ సినిమాలు సెట్ అయ్యాయి. ఇక మీదట కూడా ఇలాంటి క్రేజీ కాంబినేషన్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

 

సినిమాకు కథ, కథనాలు ఎలా కావాలో కథకు తగిన హీరో.. కంటెంట్ చెప్పగలిగే డైరక్టర్ ఇద్దరు ఇంపార్టెంట్.. అలాంటి కాంబో కలిస్తే ఇక ఆడియెన్స్ కు పండుగే. ఒకప్పుడు సినిమాలు హీరోని బట్టి ఆడేవి. హీరోలను ఆరాధించే తెలుగు ప్రేక్షకులు వాళ్ళు ఏం చేసినా చూసేవారు. అయితే పరిస్థితి మారింది. హీరోలను చూసి కాదు డైరక్టర్స్ ను చూసి సినిమాలకు వస్తున్నారు. అంతేకాదు క్రేజీ డైరక్టర్, స్టార్ హీరో ఇలాంటి కాంబినేషన్ అయితే ఇక ఆ సినిమా లెక్క వేరేలా ఉంటుంది. ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ ఫిక్స్ చేయడంలో నిర్మాతలు ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. 

 

కేవలం మన దగ్గరే కాదు కోలీవుడ్ డైరక్టర్స్ తో కూడా మన హీరోలు కాంబో సెట్ చేసుకుంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సత్తా చాటాలని అక్కడ క్రేజీ డైరక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. హీరో, డైరక్టర్ కలిసి హిట్ కొడితే ఆ కాంబో క్రేజీగా మారుతుంది. తెలుగులో ఇలాంటి క్రేజీ కాంబో మూవీస్ చాలానే వచ్చాయి. ఇక మీదట కూడా అలాంటి కాంబోలో సినిమాలు రావాలని ఆశిద్దాం. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: