అనుష్క తో ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే చాలు ఆమె పెళ్ళి గురించి ప్రభాస్ తో ఆమె సాన్నిహిత్యం గురించి ప్రశ్నలు అడగకుండా ఆ ఇంటర్వ్యూను పూర్తి చేయలేకపోతున్నాడు. అనుష్క అనేకసార్లు ప్రభాస్ కేవలం తనకు ఒక మంచి మిత్రుడు మాత్రమే అని అనేకసార్లు క్లారిటీ ఇచ్చినా అనుష్క కు ప్రభాస్ కు సమస్యలు తప్పడంలేదు. 


ఈ నేపధ్యంలో యాంకర్ సుమ నిర్వహించే క్యాష్ ప్రోగ్రామ్ కు వచ్చిన అనుష్క ప్రభాస్ ఫోటోను చూసి ఒక వింత కామెంట్ చేసింది. సుమ ప్రభాస్ ఫోటోను అనుష్కకు చూపెట్టి దాని పై కామెంట్ చేయమని కోరగా సుమకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది అనుష్క. 


ప్రభాస్ తనకు ‘కొడుకు’ అంటూ అనుష్క ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ‘బాహుబలి’ మూవీలో ప్రభాస్ ఒక పాత్రలో తనకు భర్తగా మరొక పాత్రలో తనకు కొడుకుగా కనిపించిన పరిస్థితులలో ఆవిషయాన్ని దృష్టిలో పెట్టుకుని అనుష్క ఇలా కామెంట్ చేసింది అనుకోవాలి. అంతేకాదు అక్కడతో అయినా తనకు ప్రభాస్ కు మధ్య రిలేషన్ షిప్ వార్తలు వ్రాస్తున్నవారు ఆగిపోతారని అనుష్క ఎత్తుగడ అయి ఉండాలి. అయితే మీడియా మాత్రం అనుష్క వేదనను అర్ధం చేసుకునే స్థితిలో లేదు. ఆమె అధికారికంగా ఎవర్నో ఒకరిని పెళ్ళి చేసుకునే వరకు ఆమెకు ఈ ప్రశ్నలు ఎదురౌతూనే ఉంటాయి. లేటెస్ట్ గా కన్నడ మీడియా ఈమె పెళ్ళి పై వార్తలు వ్రాస్తూ ఈమె కుటుంబ సభ్యులు కన్నడ ప్రాంతానికి చెందిన ప్రముఖ యువ పారిశ్రామికవేత్త తో అనుష్క ఎరైంజిడ్ మ్యారేజ్ గురించి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వ్రాస్తోంది.  


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితులలో సినిమా ధియేటర్లు ఇప్పట్లో మళ్ళీ తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. అయినా ధియేటర్లు ఓపెన్ అవ్వగానే మొదటి సినిమా వచ్చి ఏప్రిల్ నెలలో తన ‘నిశ్శబ్దం’ మూవీతో కలక్షన్స్ సునామి సృష్టించాలి అని అనుష్క ఇలాంటి పరిస్థితులలో కూడ చాల ముందు చూపుతో ‘నిశ్శబ్దం’ ప్రమోషన్ ను కొనసాగిస్తూ అనేక ఇంటర్యూలు ఇస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: