టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. దాదాపు 20 ఏళ్ల క్రిందట కెరీర్ ప్రారంభించి.. వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నారు. తన నటనతో, తన వాక్చాతుర్యంతో కోట్లమంది అభిమానులను సంపాదించున్నారు. ఈ 20 ఏళ్ల సినీ జీవితంలో ఆయ‌న‌ చూసిన ఒడిదుడుకులు ఎవరు చూసి ఉండ‌రేమో. అయిన వాళ్లు అందరూ ఉన్నా ఒంటగిగానే బ్రతికాడు. అయితే అందరూ దూరమైన, అభిమానులే ఆయ‌న అండ అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక తాత‌గారితో ఎన్నో సినిమాల్లో బాల‌న‌టుడిగా న‌టించిన ఎన్టీఆర్.. పూర్తిస్థాయిలో హీరోగా నటించిన తొలి సినిమా మాత్రం నిన్నుచూడాలని. తొలి ప్రయత్నంలో నిరాశ పరిచినా రెండో సినిమా స్టూడెంట్‌ నెంబర్‌ 1 తో మాత్రం భారీ సక్సెస్‌ అందుకున్నాడు.

 

ఈ సినిమాతోనే టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళి కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రం సూప‌ర్ స‌క్సెప్ అవ్వ‌డ‌మే కాకుండా బాక్సాఫిస్ వ‌ద్ద రికార్డులు క్రియేట్ చేసింది. స్టూడెంట్‌ నెంబర్‌ 1 సినిమాతో యూత్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్‌. ఇక ఇదే కాంబినేష‌న్ ఆ త‌ర్వాత వ‌చ్చిన చిత్రం  సింహాద్రి. మొద‌టి సినిమా ఎన్టీఆర్‌కు తొలి హిట్ అందించిన రాజమౌళి.. సింహాద్రి సినిమాతో స్టార్‌ హీరోల సరసన నిలబెట్టాడు. అప్పటి వరకు కాస్త తడబడుతూ నడిచిన ఎన్టీఆర్‌ కెరీర్‌ సింహాద్రి సినిమాతో ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లోనే వ‌చ్చిన యమదొంగ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించ‌డ‌మే కాకుండా హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్, యాక్షన్ అల్టిమేట్ అని చెప్పాలి. నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్.. వెరసి కంప్లీట్ హీరో బయటికి వచ్చాడు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న చూసిన జనాలు పౌరాణిక పాత్రలు చేయాలంటే ఈ జనరేషన్ లో ఎన్టీఆర్ యే చేయాలి అని ప్ర‌శంస‌లు కూడా కురిపించారు. మ‌రియు వీరిద్ద‌రి కాంబో సినిమా వ‌స్తుందంటే రికార్డులు బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే అని ప్రేక్ష‌కులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో వీళ్లు మళ్లీ కలిశారు. మ‌రి ఈ చిత్రం ఏ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: