టాలీవుడ్ లో ప్రభాస్ కెరీర్ లో చెప్పుకోదగిన సినిమా, బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి అతన్ని అంతర్జాతీయ స్టార్ ని చేసిన సినిమా... బాహుబలి. ఈ టైటిల్ లో వచ్చిన రెండు సీరీస్ లు కూడా ప్రభాస్ క్రేజ్ ని అమాంతం పెంచేశాయి అనేది వాస్తవం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. వసూళ్ళ పరంగా కూడా అవి సాధించిన విజయం ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సాధించలేదు అనేది వాస్తవం. ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమాలు ఒక మైలురాయి. 

 

గతంలో ప్రభాస్ హీరోగా రాజమౌళి చత్రపతి అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ప్రభాస్సినిమా చేసాడు. ఈ సినిమా కోసం దాదాపు ఆరేళ్ళ సమయాన్ని కేటాయించాడు. దీనితో ఆ సినిమాను అనుకున్న విధంగా... రాజమౌళి ప్రేక్షకులకు అందించడంలో విజయవంతం అయ్యాడు అనేది వాస్తవం. ప్రభాస్ విషయంలో జక్కన్న ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను ఒక శిల్ప౦ మాదిరి చెక్కాడు. ఈ సినిమాకు ముందు తెలుగు సినిమా, ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా. ఆ విధంగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. 

 

అక్కడి నుంచి ప్రభాస్ సినిమా అనగానే అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ప్రభాస్ కూడా తన సినిమాల విషయంలో ఇక్కడి నుంచి జాగ్రత్తలు పడుతున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ తన ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం అతని సినిమా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తుంది. ఈ సినిమా కోసం బాలీవుడ్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా రాజమౌళి ప్రభాస్ ఇమేజ్ ని ఈ సినిమా ద్వారా ఒక్కసారిగా పెంచేసాడు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: