విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టిస్తున్న నార‌ప్ప షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటోంది. ఇటీవల  సుధీర్ఘ కాలం పాటు తమిళనాడులోని అడవులు, ప్ర‌త్యేక సెట్టింగ్‌ల మ‌ధ్య  మొదలైన ఈ సినిమా భారీ షెడ్యూల్‌ ముగిసింది. దీంతో వెంక‌టేష్ హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. వెంకటేష్‌ టైటిల్‌ రోల్‌లో క‌నబ‌డనున్న ఈ సినిమాకు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వ‌హిస్తున్నారు. డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీదేవి సతీష్‌ సహ–నిర్మాతగా ఉన్నారు. చాలాకాలం త‌ర్వాత వెంక‌టేష్ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూర్చుతుండ‌టం విశేషం. షెడ్యూల్ ప్ర‌కారం షూటింగ్ పూర్తి చేసి ‘నారప్ప’ చిత్రాన్ని జూన్‌లోపే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.  

 

తమిళంలో సూపర్‌హిట్‌ సాధించిన ధనుష్‌ ‘అసురన్‌’ చిత్రానికి ‘నారప్ప’ తెలుగు రీమేక్ కావ‌డం గ‌మ‌నార్హం. విల‌క్ష‌ణ క‌థాశమే వెంక‌టేష్‌న్ విప‌రీతంగా ఆక‌ట్టుకున్న‌ట్లు స‌మాచారం. అయితే తెలుగు నేటివిటీకి అనుగుణంగా క‌థ‌లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసిన‌ట్లు చిత్ర వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.  విక్ట‌రీ వెంక‌టేష్‌కు జ‌య మ‌న‌దేరా సినిమాతో న‌టుడిగా చాలా మార్కులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత కొన్ని ప్ర‌యోగాలు చేసినా డిజాస్ట‌ర్ల‌నే మిగిల్చాయి. అయితే నార‌ప్ప మాత్రం వెంక‌టేష్ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుంద‌ని, ఆయ‌న కెరీర్‌లోనే ఇదో బిగ్గెస్ట్ హిట్‌గా మిగిలిపోతుంద‌ని చిత్ర వ‌ర్గాలు ధీమాగా చెబుతున్నాయి. 

 

క‌థ విష‌యానికి వ‌స్తే నారప్ప (వెంకటేష్) అనే రైతు తన భార్య ప్రియమణి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె మరియు అతని బావతో కలిసి సాధార‌ణ జీవితాన్ని గడుపుతాడు. కానీ, కుటుంబం మరియు అతని గ్రామానికి చెందిన సంపన్న భూస్వామి మధ్య పెరిగే కొన్ని సమస్యలు, వారి జీవితాన్ని తలక్రిందులుగా మారుస్తాయి, ఇది వరుస అసహ్యకరమైన సంఘటనలకు దారితీస్తుంది. ఈ క్ర‌మంలో తండ్రిగా అణ‌గ దొక్క‌బ‌డిన వ‌ర్గానికి చెందిన వ్య‌క్తిగా నార‌ప్ప ఎదురు తిరిగి పోరాటే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోనున్నాయ‌ట‌. సామాజిక వివ‌క్ష కొన‌సాగిన విధానంపై సందేశాత్మ‌క చిత్రంగా నిలుస్తుంద‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: