కోలీవుడ్ స్టార్ హీరో సూర్య  గత కొంత కాలంగా వరస పరాజయాలతో సతమతమవుతున్నాడు  దాంతో  తెలుగులో అయితే సూర్య మార్కెట్ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఇక సూర్య ప్రస్తుతం గురు ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్ లో ఆకాశం నీ హద్దురా అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మే లో విడుదలకానుంది. 2డి ఎంటర్ టైన్మెంట్స్ ,సిఖ్య ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం లో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుండగా మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.  
 
ఈ చిత్రంతరువాత సూర్య ,హరి డైరెక్షన్ లో  నటించనున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే ఈసారి దానికి సీక్వెల్ కాకుండా వేరే కథ తో రానున్నారు. ఈచిత్రంలో సూర్య డ్యూయెల్ రోల్ లో నటించనున్నట్లు సమాచారం అందులో ఒకటి హీరో పాత్ర కాగా మరొకటి విలన్.. మే లో  సెట్స్ మీదకు వెళ్లనుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.  
 
ఈసినిమాతో పాటు సూర్య  మరో రెండు సినిమాలకు కూడా  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో భాగంగా మాస్ డైరెక్టర్ శివ తో  సూర్యసినిమా చేయనున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఙానవేల్ రాజా నిర్మించనున్నాడు. ఈ సినిమాతోపాటు సూర్య తన 40 వచిత్రాన్ని అసురన్ ఫేమ్ వెట్రిమారన్ తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కలై పులి ఎస్ తాను ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: