తెలుగు సినీ పరిశ్రమలోకి ఎన్నో ఆశ‌ల‌తో ఎంద‌రో అడుగు పెడుతుంటారు. అందులో హిట్ అయ్యి స్టార్స్‌గా ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. ఇక‌ అసలు మ్యాట‌ర్‌లోకి వ‌స్తే.. టాలీవుడ్‌లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్‌. సినీ పరిశ్రమలో త‌న కంటూ సెప‌రేట్ మార్క్ క్రియేట్ చేసుకుని పూరి సినిమాలు ఓ ట్రాక్‌లో ఉంటాయి. ఇడియ‌ట్, అమ్మా నాన్న ఓ త‌మిళ‌ అమ్మాయి, శివ‌మ‌ణి, పోకిరి దేశ‌ముదురు లాంటి భారీ విజ‌యాల‌ను అందుకున్న ఈ డాషింగ్ డైరెక్ట‌ర్‌.. ఇటీవ‌ల వ‌ర‌స‌గా ఫ్లుపులు ప‌డ్డాయి. దీంతో పూరి పేరే టాలీవుడ్ మ‌ర‌చిపోయింది.

 

అలాంటి దారుణ స్థితిలో వ‌చ్చాడు ఇస్మార్ట్ పూరి. చాలాకాలం ఫ్లాపులతో సతమతమైన పూరి జగన్నాధ్ 'ఇస్మార్ట్ శంకర్స సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి వ‌చ్చాడు. మ‌రియు దేవదాసు సినిమాతో తెలుగు తెరకి హీరోగా పరిచయమైన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఈ సినిమాతోనే స‌క్సెస్ ట్రాక్ ఎక్కి లైఫ్ ట‌ర్న్ చేసుకున్నాడు. వరుసగా ఫ్లాప్స్ తీస్తున్న పూరికి, ఒక్క హిట్ వస్తే బావుండును అనుకుంటున్న రామ్‌కి కూడా ఊహించినదానికంటే పెద్ద హిట్‌గా నిలిచింది ఇస్మార్ట్ శంకర్. పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన ఈ సినిమాను బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు. 

 

వాస్త‌వానికి ముందు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం కొనుకున్నవాళ్లందరికి కూడా రూపాయికి రూపాయి మిగిలేలా చేసింది. రామ్ యాక్టింగ్, పూరీ టేకింగ్ కలసి సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. మ‌రియు థియేట్రికల్ రన్ లోనే కాకుండా ఇస్మార్ శంకర్ టివి ప్రీమియర్ లో కూడా భీభత్సమైన టిఆర్పి తెచ్చుకుని ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత  మంచి ఊపందుకున్న‌ పూరి విజయ్ దేవరకొండ తో సినిమా తీయనున్నాడు. మ‌రోవైపు రామ్ కూడా అదే ఎన‌ర్జీతో..  కిషోర్ తిరుమల దర్శకత్వంలో `రెడ్` మూవీ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తుంది ఈ చిత్రం. కెరీర్‌లో తొలిసారి అలాంటి జోనర్ ట్రై చేస్తున్నాడు రామ్. 

  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: