పూరీ జగన్నాధ్ డిఫరెంట్ ఆలోచనలతో సినిమాలని తీస్తాడు. తీసే ప్రతి సినిమాకి వేరియేషన్స్ చూపిస్తాడు. టైటిల్స్ విషయంలో కూడా వెరైటీ చూపిస్తాడు.ఒకప్పుడు స్టార్ డైరెక్టర్. హీరో రవితేజ, ప్రిన్స్ మహేష్ బాబు తో సూపర్ డూపర్ హిట్స్ కొట్టాడు. తర్వాత తీసిన అన్ని సినిమాలు ప్లాప్ లిస్ట్ లో చేరిపోయాయి. నష్టాల్లో కూరుకుపోయాడు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో ఒక్క హీరో దొరికితో, మంచి స్టోరీ దొరికితే?  పూరీ లైఫ్ మారిపోతుంది. మళ్ళీ విజయపధంలో దూసుకుని పోతాడు. అలాంటి టైమ్ లో పూరీ కీ ఒక హీరో దొరికాడు. ఆ హీరో కీ కూడా కష్టం కాలం. ఒకప్పుడు యంగ్ అండ్ సూపర్ హీరో. తీసిన ప్రతి సినిమా హిట్ అయింది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తర్వాత డీలా పడ్డాడు.. అతడు మరెవరో కాదు రామ్ పోతినేని. రామ్ నటించిన మొదటి చిత్రం దేవదాసు. ఇందులో ఇలియానా కథానాయిక.

 

 

వై.వీ.ఎస్. చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 జనవరి 11 న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్ కి ఫిలింఫేర్ సౌత్ - ఉత్తమ నూతన నటుడు అవార్డును అందించింది. తర్వాత జగడం, రెడీ ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో రామ్ పెద్ద హీరోల్లో ఒకడయ్యాడు.తర్వాత మస్కా, గణేష్ రామ రామ కృష్ణ కృష్ణ, కందిరీగ, ఎందుకంటే ప్రేమంట ఇలా విభిన్నమైన చిత్రాలలో నటించాడు.మొదట కొన్ని సినిమాలు విజయం సాధించిన తర్వాత సరిగా ఆడలేదు.హిట్ ఇచ్చే డైరెక్టర్ కోసం చూసాడు. 

 

 

ఆ టైమ్ లో పూరీ లైన్ లోకి వస్తే? రామ్ జీవితo సక్సెస్ బాట పడుతుంది. కష్టాల్లో ఉన్న పూరీ కూడా వియయపధంలో దూసుకుపోతాడు. అలాంటి టైమ్ లోనే ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసాడు రామ్ తో పూరీ. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. టైటిల్ విషయంలో గాని, హీరో రామ్ పాత్ర గాని డిఫరెంట్ గా చూపించాడు. భాష కుడా యాసలో పెట్టాడు. అలాగే హీరో మాస్ లుక్ తో ఇరగదీసాడు. హీరోయిన్స్, డైలాగులు, కధ, పాటలు అన్ని సినిమాకి మంచి అసెట్ గా నిలిచాయి. హీరో అండ్ డైరెక్టర్ జీవితంలోకి మళ్ళీ హిట్ అనే మాట వినిపించింది.కెరీర్‌లో సరిగ్గా హిట్ అవసరమైన సమయంలో ఈ ఇద్దరికీ మంచి బ్రేక్ ఇచ్చిందీ సినిమా. 

మరింత సమాచారం తెలుసుకోండి: