కొందరు హీరోయిన్లకి ఎంత టాలెంట్ ఉన్నా అవకాశాలు రావు. అన్నీ ఉండి కూడా ఆఫర్లు రాక ఖాళీగా ఉంటారు. అలా కాకుండా మరికొందరేమో స్టార్ హీరోయిన్ స్టేటస్ కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా చిన్న చితకా సినిమాలు చేస్తూ తమని తామే తగ్గించుకుంటారు. అయితే దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. ప్రస్తుతం అన్నీ ఉండి కూడ ఆఫర్లు దక్కించుకోలేక పోతున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.

 

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ ఆ సినిమాలో తన గ్లామర్ తో పాటూ నటనతోనూ అందరినీ ఆకర్షించింది. వెంటనే ఈ భామ ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోతుందని భావించారు. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత వచ్చిన ఆర్ డి ఎక్స్ లవ్ చిత్రం ఆమె కెరీర్ ని చాలా తీవ్రంగా దెబ్బ తీసింది. ఆ సినిమా ద్వారా ఆమెకి చాలా చెడ్డ పేరు వచ్చింది. 

 


దాంతో పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో చేయడానికి అవకాశం కోల్పోయింది. అప్పటికీ వెంకీమామా, డిస్కోరాజా సినిమాల్లో నటించినా కూడా అవి కూడా పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. దాంతో ఆమె కెరీర్ కి ఫుల్ స్టాప్ పడ్డట్టేనని అంటున్నారు. ప్రస్తుతం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ౫ డబ్ల్యూస్ అనే చిత్రంలో నటిస్తుంది. లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రదీప్ ఠాకూర్ దర్శకత్వం వహిస్తున్నారు. 

 


సెకండ్ హీరోయిన్ గా చేసిన సినిమాలే సక్సెస్ కానటువంటి ఈ తరుణంలో పాయల్ ఫీమేల్ లీడ్ లో చేస్తున్న ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా అనేది సందేహంగా ఉంది. ఈ సినిమా హిట్ అయితే గానీ పాయల్ కి అవకాశం రాదు. మరి ఈ సినిమా హిట్ అయి పాయల్ టాలీవుడ్ సెటిల్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: