తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన హీరో ఎన్టీఆర్. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆరే అనేంతగా తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. అటువంటి ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించి ఆ స్థానాన్ని పొందేలా చేసిన సినిమా అడవిరాముడు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా వారి కాంబోలో వచ్చిన తొలి సినిమా. ఆ సినిమా సృష్టించిన రికార్డులకు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

IHG

 

ఎన్టీఆర్జయప్రద హీరో హీరోయిన్లుగా రాఘవేంద్రరావు 1977లో వచ్చిన ఆ సినిమా చాలా పెద్ద మాసివ్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆ సినిమాలో ‘ఆరేసుకోబోయి.. పారేసుకున్నాను హరీ..’ అనే పాట సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా మంత్రముగ్దులైపోయారు. ఆ పాటకు ఎన్టీఆర్ అభిమానులు తెరపై డబ్బులు విసిరే వారంటే ఆ పాట ఏస్థాయిలో హిట్టయిందో అర్ధం చేసుకోవచ్చు. కేవీ మహదేవన్ సంగీతంలో గేయ రచయిత వేటూరి అందించిన సాహిత్యానికి అభిమానులకు పూనకాలే వచ్చాయి. నిజానికి ఈ పాటను ఇలాగే రాయలేదట వేటూరి. హార్స్ రేసులకు ఎక్కువగా వెళ్లే వేటూరి పందాల్లో డబ్బులు పోగోట్టుకున్నారట. ఓ సందర్భంలో.. ‘ఆ రేసులో పారేసుకున్నాను..’ అనుకున్నారట.

IHG

 

సరిగ్గా అడవిరాముడులో సినిమా సమయంలో ఇది జరగటం.. సందర్భానుసారం పాట రావడంతో ఆ మాటను కలిపి పాటగా రాసేసారట. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 11 సినిమాలు వచ్చాయి. గజదొంగ, జస్టిస్ చౌదరి, డ్రైవర్ రాముడు, తిరుగులేని మనిషి, వేటగాడు, మేజర్ చంద్రకాంత్ వంటి భారీ బ్లాక్ బస్టర్లు వీరి కాంబోలో ఉన్నాయి. 1973లో కన్నడలో రాజ్ కుమార్ హీరోగా వచ్చిన గంధాడ గుడి సినిమాకు రీమేక్ అడవిరాముడు. రాఘవేంద్రరావు సినిమాలతోనే ఎన్టీఆర్ కు విపరీతమైన మాస్ ఇమేజ్ సొంతమైందనేది నిజం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: