ప్రస్తుతం ఎటు చుసిన కరోనా గురించే మాట్లాడుతున్నారు. ఈ వైరస్ ప్రభావం అలాంటిది మరి. ఈ వైరస్ పుట్టింది చైనాలో అయినా ఇప్పుడు ప్రపంచ దేశాలనింటిని పలకరిస్తూ వస్తుంది. ఈ మహమ్మారి వెళ్లిన ప్రతి చోట కొన్ని వేల మందికి తన ప్రభావాన్ని చూపిస్తూ కొన్ని కోట్ల మందిని భయబ్రాంతులకు గురి చేస్తూ ప్రస్తుతం రాజ్యం మేలుతుంది.

 

ఈ వైరస్ వలన ఆర్థిక పరంగా చాలా నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే కొన్ని కంపెనీ యాజమాన్యాలు వర్క్ ఫ్రొమ్ హోమ్ ఇచ్చి ఆఫీస్ లకు సెలవులు ప్రకటించారు. ఇటు పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. థియేటర్స్ ను మూసి వేశారు. అటు చికెన్, గుడ్లు, వ్యాపార సంస్థలపై కూడా దాని మాములుగా లేదనుకోండి.

 

ఇటు సినీ ఇండస్ట్రీ వైపు చుస్తే కరోనా కారణంగా రిలీజ్ సినిమాలను వాయిదా వేసుకున్నారు. సినిమా షూటింగ్ కి కొన్ని రోజులు విరామం ప్రకటించారు. దింతో హీరో, హీరోయిన్స్ అందరు వారి ఇండ్లలో ఉండిపోయారు. ఫిదా హీరో వరుణ్‌ తేజ్‌ తనకు ఇష్టమైన బాక్సింగ్‌ నేర్చుకుంటున్నాడు. తాను ఇంట్లోనే గడుపుతున్నానని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

 

ఇక గత రెండు సంవత్సరాల నుంచి క్షణం తీరిక లేకుండా అగ్రహీరోలతో నటిస్తున్న రష్మిక షూటింగ్‌లు నిలిపివేయడంతో ఇంటికే పరిమితమయ్యారు. తన పెంపుడు కుక్కతో ఆడుకుంటున్నానంటూ సోషల్ మీడియాతెలిపారు.

 

 ఇలా తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబాలతో గడుపుతున్నారు. ఎన్నడూ లేనివిధంగా సినిమా తారలు ఎక్కువరోజులు ఇండ్ల వద్దే ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. బయటకు వెళ్లి వ్యాధులను కొని తెచ్చుకోవడంకంటే ఇంట్లోనే కుటుంబంతో గడిపితే మేలని చాలామంది ఇంట్లోనే ఉండిపోతున్నారు.

 

పబ్‌లు, క్లబ్‌లతో పాటు రిసార్ట్‌లలో పార్టీలు కూడా బంద్‌ కావడంతో నటీ నటులంతా సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉంటూ తమ కుటుంబాలతో గడుపుతున్నారు. ఫిలింనగర్‌ షూటింగ్‌లు లేక కళ తప్పింది. తారలు బయటకు రాకపోవడంతో స్టూడియోలు, షూటింగ్‌ల స్పాట్‌లు వెలవెల పోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: