తమిళ స్టార్ హీరో విజయ్ - ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన తుపాకి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.. ఈచిత్రం తెలుగులో కూడా విజయం సాధించించి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ తీసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మురగదాస్ ,విజయ్ కి కథ కూడా వినిపించాడట  విజయ్ కూడా తన 65వ చిత్రాన్ని మురగదాస్ తోనే చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని  కోలీవుడ్ మీడియా వెల్లడించింది. సన్ పిక్చర్స్  ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు వున్నాయి. త్వరలోనే  ఈసినిమా గురించి క్లారిటీ రానుంది. ఇక విజయ్ - మురగా కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 
 
ఇదిలావుంటే విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్  విడుదలకు రెడీ అవుతుంది.  ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించడంతో మాస్టర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా  ఆండ్రియా ,శంతన్ భాగ్యరాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎక్స్ బి క్రియేటర్స్ నిర్మిస్తుంది. ఏప్రిల్  చివర్లో  విడుదలకానుంది. ఇక మాస్టర్ ను తెలుగులో మహేష్ కోనేరు విడుదలచేయనున్నాడు. ఇంతకుముందు విజయ్ నటించిన విజిల్ ను కూడా తెలుగులో కోనేరే విడుదల చేయగా ఆసినిమా లాభాలను తీసుకొచ్చింది. కాగా సర్కార్ ,విజిల్ విజయాలు సాధించడం తో  మాస్టర్ పై తెలుగు లో కూడా మంచి అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: