టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన హీరోయిన్స్ అనుష్క కూడా ఒక‌రు. హీరోలతో సమానంగా పాపులారిటీ, పారితోషకాలు అందుకోగల అతి కొద్దిమంది టాలీవుడ్‌ హీరోయిన్లలోనూ ఈమె ఉంటుంది. తన అందం అభినయంతో తెలుగు చిత్రం సీమలో ఎన్నో విజయాల్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. తెలుగు, తమిళ భాషలలో కలిపి సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించింది. ఈ క్ర‌మంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక టాలీవుడ్‌లో అదిరిపోయే జోడీ అంటే టక్కున చెప్పే పేర్లు ప్రభాస్, అనుష్క. తెరపై వాళ్ల కెమిస్ట్రీ, బయట వాళ్లిద్దరి మధ్య స్నేహం అందరికీ తెలిసిందే.

 

వీళ్లిద్దరి మధ్య ఉన్న చనువు కారణంగా వీరిపై అనేక రూమర్లు ఇప్పటికీ చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటాయి. ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నా వీళ్లు ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వదంతులు వస్తూనే ఉంటాయి. ఈ రూమర్‌ను వాళ్లిద్దరూ ఖండించడంతో కొన్నాళ్లు ప్రశాంతంగానే ఉంది. మళ్లీ ఈ మధ్య ఆ ప్రచారం ఊపందుకుంది. అయితే ఇది నిజం కాద‌ని అంద‌రికీ తెలిసినా.. నిజం అయితే బాగుంటు అనుకునే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అంత‌గా వీరిద్ద‌రూ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర అయ్యారు కాబ‌ట్టి. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. ప్ర‌భాస్ కోసం సినిమాల‌ను వ‌దిలేస్తానంటుంది అనుష్క‌.

 

అవును! ఇది స్వ‌యంగా అనుష్క‌నే చెప్పింది. అనుష్క నిశ్శబ్ధం సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. సుమ్మ‌క్క `క్యాష్‌` ప్రోగ్రాంలో స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చింది. అయితే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఇందులో అనుష్క గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం, అనుష్కకు సుమ ప్రత్యేకంగా స్వాగతం పలకడం ఎంతగానో అలరించింది. ఈ క్ర‌మంలోనే సుమ ఈ రెండిటిలో ఏదైనా వదులుకోవాల్సి వస్తే ప్రభాస్‌తో ఫ్రెండ్‌షిప్ వదులుకుంటారా?, సినిమాలలో యాక్టింగ్ వదులుకుంటారా? అని అడ‌గ‌గా స్వీటీ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ఫ్రెండ్‌షిప్ కన్న సినిమాలు ఏ మాత్రం ముఖ్యం కాదని అలాంటి సిచువేషన్ వ‌స్తే పక్కాగా సినిమాలే వదిలేస్తానని తేల్చి చెప్పింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: