ప్రస్తుతం ప్రపంచంలో భయంకరమైన ఉపద్రవాన్ని సృష్టిస్తుంది కరోనా వైరస్.  ఈ కరోనా ప్రభావంతో జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి.  ఏం చేసినా కరోనా వస్తుందేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి.  ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఐదేవేలకు పైగా మరణాలు సంబవించాయంటే దీని వీత్రవ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. లక్షకు పైగా ఈ కరోనా భారిన పడ్డారు.  ఇప్పటికే దేశంలో కరోనా గురించి ప్రముఖులు తమ సూచనలు వీడియోల ద్వారా ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, నిశ్శబ్దం టీమ్, పలువురు యాంకర్లు, బాలీవుడ్ నటులు కరోనా గురించి జాగ్రత్తలు తెలియజేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. మరోపక్క  ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా, కరోనా బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

 

తాజాగా మెగస్టార్ చిరంజీవికరోనా వైరస్ గురించి జాగ్రత్తలు తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.  ప్రస్తుతం ఆయన కోరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఈ చిత్రం షూటింగ్ కొంత కాలం వరకు ఆపివేస్తున్నామని స్వయంగా ఆయనే ప్రకటించారు.   కరోనా పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని.. సాద్యమైనంత వరకు ఎదుటి వ్యక్తికి నమస్కారం పెట్టాలని.. షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానివేయాలని అన్నారు. నమస్కారం అనేది భారతీయ సంస్కృతి.. ఇప్పుడు ఈ సంస్కృతిని ప్రపంచ దేశాలే పాటిస్తున్నాయి.. మన సంస్కృతిని మనం పాటించాలి... తప్పకుండా నమస్కరం తో సరిపెట్టుకోవాలి.

 

జనలు గుంపులు గుంపులుగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.  తుమ్మినా, దగ్గినా వారికి దాదాపు దూరంగా ఉండటం మంచిది. మనం పరిశుభ్రతలు పాటిస్తే.. మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం.. ఒకవేళ కరోనా సిమిటమ్స్ ఉన్నాయని అనుమానం ఉంటే.. వెంటనే దగ్గరలోని డాక్టర్లను సంప్రదించి సరైన చికిత్స  తీసుకోవాలని సూచించారు.  ముఖానికి మాస్క్ ధరించి బయట తిరగడం మంచిదన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: