శతాధిక చిత్ర దర్శకుడు మన కె. రాఘవేంద్ర రావు. ఈయన సినిమాలు అనేక విజయాల్ని అందుకున్నాయి. కేవలం సినిమాలకే కాకుండా కె. రాఘవేంద్ర రావు సినిమాలలో నటించిన హీరోలకీ, హీరోయిన్లకి కూడా మంచి పేరు తెచ్చాయి. కేవలం దర్శకుడు మాత్రమే కాదు కె. రాఘవేంద్ర రావు గారు ఒక నిర్మాత కూడా. ఈయన పలు సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారు. స్త్రీ పాత్రలని ప్రధానంగా పెట్టి సినిమాలని తీయడం ఈయన స్టైల్ . 

 

IHG

 

 

కానీ కె. రాఘవేంద్ర రావు మాత్రం ఈ స్టైల్ లో సినిమాలు తీసాడు. ఈ సినిమాలకి మంచి పేరు కూడా వచ్చింది. స్త్రీ పాత్రలని ప్రధానంగా పెట్టి జ్యోతి, ఆమె కధ , కల్పన సినిమాల్ని తీసాడు. దర్శకుడు కె .రాఘవేంద్ర రావుకి. ఇతనిని దర్శకేంద్రుడు అని కూడా పిలుస్తారు. 

 

విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడిగా బిరుదు పొందిన నందమూరి తారక రామారావు అనేక సినిమాలలో నటించి ఎంతగానో ప్రసిద్ధి చెందారు. ఆయన నటనకి ఎవరైనా ముగ్ధులవ్వక తప్పదు. సీతారామ కళ్యాణం, గులేబకావలి కధ, శ్రీ కృష్ణ పండవీయం, వరకట్నం, తల్లా పెళ్ళామా, తాతమ్మకల, చాణక్య చంద్ర గుప్తా, చందా శాసనుడు ఇలా అనేక సినిమాలలో నటించాడు.

 

IHG

 

 

అయితే కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అన్నగారు  అనేక సినిమాలలో నటించారు . అడవి రాముడు, సింహ బలుడు , డ్రైవర్ రాముడు, వేటగాడు, గజదొంగ, కొండవీటి సింహం , తిరుగులేని మనిషి, జస్టిస్ చౌదరి వంటి సినిమాలలో నటించాడు ఎన్టీఆర్. ఇలా వీరి కాంబినేషన్ హిట్ అయ్యింది. అనేక సినిమాలకి ప్రశంసలు వచ్చి హిట్లు లభించాయి వీరి కాంబినేషన్ లో. 

మరింత సమాచారం తెలుసుకోండి: