స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొంత మంది దర్శకులతో ఎక్కువ సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. అల్లు అర్జున్... త్రివిక్రమ్ కు మధ్య బంధం బాగా సెట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి , సన్నాఫ్ సత్యమూర్తితో పాటు ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠ పురం లో మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. అలా వీరి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. వీరిద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - బన్నీ కాంబినేషన్ అన్న అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి.
వీరిద్దరి కాంబినేషన్లో 2004లో వచ్చిన ఆర్య సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా అల్లు అర్జున్ కు యూత్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మరోసారి ఆ సినిమాకు సీక్వెల్ గా ఆర్య 2 సినిమా చేసినా అది ఓ మోస్తరుగా ఆడింది. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడం... అటు రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ? అన్న అంచనాలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి.
బన్నీ ఈ సినిమా లో లారీ డ్రైవర్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇద్దరు ఇండస్ట్రీ హిట్లు కొట్టి ఉన్నారు. అటు రష్మిక కూడా సౌత్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తోన్న ఈ సినిమా తెలుగు సినిమాకు ఇంకెంత బెంచ్ మార్క్ సెట్ చేస్తుందో ? ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో ? చూడాలి.