ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా(కోవిడ్ 19) భయంతో ఊగిపోతుంది. చైనాలోని పుహాన్ నుంచి పుట్టుకొచ్చిన ఈ కరోనా వైరస్ ప్రపంచ మొత్తం అతలాకుతలం చేసేస్తుంది.  మనుషులు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే వణుకు పుట్టు పరిస్థి నెలకొంటుంది.  మరీ దారుణమైన విషయం ఏంటేంటే ఈ కరోనాకు ఇప్పటి వరకు మందు కనిపెట్టలేకపోవడం. ఇక కరోనా గురించి ఎవరికి తోచిన మాటలు వారు మాట్లాడుతున్న విషయం తెలిసిందే. తాజాయా ప్రపంచ శాంతి దూత అంటూ చెప్పుకునే కెఏ పాల్ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నా అంటూ.. విశాఖ సమీపంలోని 25 ఎకరాల్లో తమ ఛారిటీకి 100 గదులు ఉన్నాయని అన్నారు. 

 

అలాగే హైదరాబాదుకు సమీపంలో ఉన్న సంగారెడ్డిలో 300 గదులు ఉన్నాయని... కరోనా బాధితుల కోసం ఈ గదులను ఉచితంగా వాడుకోవచ్చని ఆయన అన్నారు.  దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అంటే రాష్ట్ర సీఎం లు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదా.. కెఎ పాల్ ఆఫర్ ఇవ్వడం ఏంటీ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  తాజాగా ఈ విషయం సంచనల దర్శకుడు రాంగోపాల్ వర్మ పిచ్చి సీరియస్ అయినట్లు తెలుస్తుంది.  

 

అరేయ్ కేఏ పాల్... ఈ సుత్తి సలహాలను ఇచ్చే బదులు.. నీ దేవునితో చెప్పి కరోనాను తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బారావ్. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే... నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చేటట్టు చేయి ఎంకమ్మా' అంటూ ట్విట్టర్ ద్వారా పరుష వ్యాఖ్యలు చేశారు. అయితే కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ కలిసి ముందుకు నడవాలే.. ఈ సమయంలో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోకూడదని కొంత మంది నెటిజన్లు అంటున్నారు.  అయితే వర్మ చేసిన   ఈ వ్యాఖ్యలపై కేఏ పాల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: