పవర్ స్టార్ అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. ప్రేక్షకులకు ఇతను వీరాభిమానం. తెలుగు చిత్ర పరిశ్రమల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక్క ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో. తన నటన చాల సహజంగా ఉంటుంది. పవన్ కి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇటు సినిమాలోను అటు రాజకీయాల్లోను రాణిస్తూ ప్రజల నుండి మంచి ఆదరణ పొందాడు. 

 

పవన్ అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. అతను చేసిన సినిమాలో జానీ, తమ్ముడు, ఖుషి, జల్సా, గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి సినిమాలు అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. పవన్ కళ్యాణ్ కి సినీ పరిశ్రమలో కొత్తగా అడుగు పెట్టేవారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. పవన్ కి ఇండస్ట్రీలో చాలా మంది శ్రేయోభిలాషులు ఉన్నారు.

 

సినీ చిత్ర పరిశ్రమ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన బెస్ట్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ అని అంటుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలనుకునే వారిలో త్రివిక్రమ్ ఒకరు. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమా స్టార్ట్ అవ్వడానికి త్రివిక్రమ్ కూడా కారణమని బలమైన సమాచారం. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నారని లేటెస్ట్ న్యూస్..

 

త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. తీన్ మార్ సినిమాకు త్రివిక్రమ్ మాటల అందించాడు. అజ్ఞాత వాసీ  సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా ఆడలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో మాటలు, ఫ్యామిలీ డ్రామా, కామెడీ ఎంటర్టైన్మెంట్ లో త్రివిక్రమ్ ది బెస్ట్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే వాకీల్ సాబ్ లో త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నారని ఫిల్మ్ సర్కిల్లో టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: