జబర్దస్త్ హాస్యనటులు కోట్ల మంది తెలుగు ప్రేక్షకుల బాధలు పొగుడుతూ వాళ్ళని మనసారా నవ్విస్తుంటారు. కానీ తెరపై కనిపిస్తూ అందర్నీ నవ్వించే ఈ హాస్యనటులు తెరవెనుక ఎంత విషాదకరమైన జీవితాన్ని సాగిస్తున్నారో తెలిస్తే ప్రతిఒక్కరికి కంట నీళ్లు చెమ్మగిల్లటం ఖాయం. తాజాగా ఓ జబర్దస్త్ కమెడియన్ తన జీవితంలో జరిగిన ఓ విషాద సంఘటన గురించి చెబుతూ భావోద్వేగానికి గురి అయ్యాడు.




గత ఏడు సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న జబర్దస్త్ షో వందల మంది కమెడియన్ల కు మంచి జీవితాన్ని ప్రసాదించింది. అందులోని ఒక్కడైనా కమెడియనే హైపర్ ఆది స్కిట్లలో అప్పుడప్పుడు కనిపించే లండన్ రాజు. గతంలో ఇతను హైపర్ ఆది స్కిట్ల లో 'లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్' అనే డైలాగు చెప్పి అందర్నీ కడుపుబ్బా నవ్వించాడు. నిజానికి ఈ డైలాగ్ ఒక్కటే అతడిని చాలా పాపులర్ చేసింది. అతని అసలు పేరు వెంకటేశ్వర్లు. ఒంగోలులోని ఓ చిన్న పల్లెటూరులో ఇతని తల్లిదండ్రులు నివసిస్తూ వ్యవసాయం చేసేవారు.




అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని లండన్ రాజు మాట్లాడుతూ... ఒకరోజు తన తండ్రి పొలం పనులు చేసుకుని ఇంటికి వస్తూ వర్షంలో బాగా తడిచాడని... ఆ తర్వాత తీవ్రమైన జ్వరం వచ్చిందని... హాస్పటల్ కి తీసుకెళదామంటే ఏ వాహనం అందుబాటులో లేదని అంతలోనే తన తండ్రి చనిపోయాడని... అప్పుడు తను, తన తల్లి బయట కూర్చుని వర్షంలో తడుస్తూ ఏడ్చామని చెప్పాడు. ఆ ఊరి ప్రజలు తన తండ్రి శవాన్ని చూడడానికి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు లండన్ రాజు. తను అనుభవించిన పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని లండన్ రాజు చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తండ్రి మరణానంతరం రెండు బర్రెలను తెచ్చుకొని తన జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు... ఆ దశలోనే హైపర్ ఆది ఛాన్స్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. ఇంతకు ముందు పూరి గుడిసెలో తలదాచుకున్నామని కానీ జబర్దస్త్ వల్ల కాస్తో కూస్తో డబ్బులు సంపాదించి రెండు గదుల ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు లండన్ రాజు. 

మరింత సమాచారం తెలుసుకోండి: