నాచురల్ స్టార్ నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా వి. ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు. నానితో అష్టా చెమ్మ, జెంటిల్మన్ సినిమాలు చేసిన మోహనకృష్ణ నాని కోసమే వి లాంటి డిఫరెంట్ స్టోరీ రాసుకున్నాడట. విలో నాని నట విశ్వరూపం చూడొచ్చని అంటున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ ఉగాదికి సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడ్డది. 

 

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్స్ గా నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఇక ఈ సినిమా గురించి ఒక టాప్ సీక్రెట్ బయటకు రివీల్ అయ్యింది. నాని, ఇంద్రగంటి మోహనకృష్ణ ఇద్దరు కలిసి ఈ సినిమాను బాహుబలి రేంజ్ లో ప్లాన్ చేశారట. అందుకే సినిమా రిలీజ్ కు ముందే రెండు పార్టీలు అంటూ హింట్ ఇస్తున్నారు. నాని వి నిజంగా రెండు పార్టులా అంటే అవునని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 

 

సినిమా జానర్ ను బట్టి ఆ సినిమాను ఎలా ఆడియెన్స్ లో తీసుకెళ్ళాలో దిల్ రాజుకి బాగా తెలుసు. అందుకే వి సినిమాకు డిఫరెంట్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందట. అంతేకాదు ఊహించని విధంగా చాలా ట్విస్ట్ లు ఆడియెన్స్ ను సర్ ప్రయిజ్ చేస్తాయట. వి సినిమా రెండు పార్టులుగా ముందే తీసి వి సినిమా ఎండింగ్ లో సీక్వల్ కూడా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. 

 

ఈమధ్య నాని నిర్మించిన హిట్ సినిమాకు కూడా అలానే చేశారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా క్లైమాక్స్ లో హిట్ 2 అంటూ షాక్ ఇచ్చారు. ఆ సినిమా సీక్వల్ 2021లో వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు అదే విధంగా వి సినిమాకు సీక్వల్ ప్లాన్ చేశాడు నాని. బాహుబలి ఇచ్చిన స్పూర్తితో కంటెంట్ ఉన్న సినిమాకు ఇలా సీక్వల్ ప్లాన్ చేసి ఆడియెన్స్ కు సర్ ప్రయిజ్ ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: