టాలీవుడ్ దిగ్గజ సూపర్ స్టార్ కృష్ణ గారి చిన్న తనయుడు, లేటెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి, అలానే ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు సూపర్ డూపర్ హిట్స్ కొట్టి హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పటివరకు మహేష్ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటించినప్పటికీ, ఆయన క్రేజ్ మాత్రం ఒకింత బాలీవుడ్ హీరోల రేంజ్ లో ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ముఖ్యంగా మహేష్ బాబు మాత్రమే తమ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కావాలని ఇప్పటికీ కొన్ని జాతీయ బ్రాండింగ్ సంస్థలు ఎగబడుతున్నాయంటే, మన సూపర్ స్టార్ క్రేజ్ ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. 

 

ముఖ్యంగా మహేష్ కు చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు. అలానే ఆయన నటించిన కొన్ని తెలుగు సినిమాలు హిందీలో డబ్ కాబడి మంచి వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతుంటాయి. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా టైమ్స్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ మెన్ అవార్డ్స్ లో సూపర్ స్టార్ మహేష్ ఇప్పటివరకు ఒక్కసారి నెంబర్ వన్ గా టైటిల్ అందుకోగా, మరొకసారి సెకండ్ ప్లేస్ లో ఆపై ఒకసారి థర్డ్ ప్లేస్ లో నిలిచారు. అయితే గత ఏడాది సూపర్ స్టార్ ఏకంగా ఫరెవర్ డిజైరబుల్ మెన్ గా ఒక గొప్ప స్థానాన్ని సంపాదించడం జరిగింది. 

 

ఇక ఈ ఏడాదికి గాను నిన్న ప్రకటించిన తాజా మోస్ట్ డిజైరబుల్ మెన్ కాంటెస్ట్ లో ఏకంగా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి దిగ్గజ బాలీవుడ్ నటుల సరసన ఫరెవర్ డిజైరబుల్ మాన్ గా స్థానం సంపాదించిన మహేష్ బాబు, మొత్తంగా ఇండియాలో 5వ ఫరెవర్ డిజైరబుల్ మ్యాన్ గా, అలానే సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి మొట్ట మొదటి స్టార్ గా ఒక గొప్ప రికార్డు ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ రికార్డు మహేష్ కు దక్కడంతో పలువురు ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు సైతం మహేష్ బాబు పై పొగడ్తలు కురిపిస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: