లేటెస్ట్ మూవీ ‘హిట్’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన  చిత్రం  విడుదలై పాజిటివ్ టాక్‌ను రాబట్టింది. మంచిబజ్‌తో థియేటర్స్‌కి వచ్చిన హిట్ మూవీ తొలిరోజు మంచి కలెక్షన్లే రాబట్టింది. ఈ నగరానికి ఏమైంది?, ఫలక్ నుమాదాస్ చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. తర్వాత హిట్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. నాచురల్ స్టార్  నాని ఈ సినిమాకి నిర్మాత గా మారాడు. మంచి లాభాల్ని అందుకున్నాడు. 

 

మొదటి 15 నిమిషాలు మీరు థియేటర్‌కి వచ్చికూర్చోండి.. ఆ తరువాత సీట్లలో మిమ్మల్ని నేను కూర్చోబెడతా.. వచ్చేటప్పుడు ఎక్కువ వాటర్ తాగి మాత్రం రావొద్దు. ఎందుకంటే టాయిలెట్ వస్తే మధ్యలో లేవలేరు. అంతలా ఉండబోతుంది ‘హిట్’ సినిమా అంటూ హీరో విశ్వక్ సేన్ చెప్పనంత రేంజ్‌లో ఈ సినిమా లేదు కాని.. సినిమా చూసిన ప్రేక్షకుల్ని ‘హిట్’ డిజప్పాయింట్ చేయదు అని మాత్రం చెప్పొచ్చుహిట్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత యంగ్ హీరో విశ్వక్‌సేన్ మరో చిత్రాన్ని ప్రారంభించారు. విశ్వక్‌సేన్ హీరోగా ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న ‘పాగ‌ల్’ చిత్రం షూటింగ్ గురువారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

 

ఈ చిత్రం ద్వారా న‌రేష్ కుప్పిలి ద‌ర్శకుడిగా మనకి  ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. పూజాకార్యక్రమాల అనంతరం విశ్వక్‌సేన్‌పై చిత్రీక‌రించిన ముహూర్తపు స‌న్నివేశానికి హీరో రానా ద‌గ్గుబాటి క్లాప్ కొట్టగా, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ అధినేత పి.కిర‌ణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు.ముహూర్తపు సన్నివేశానికి ద‌ర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు.  ఈ ప్రారంభ వేడుక‌లో చిత్రసీమ‌కు చెందిన ప‌లువురు ప్రముఖులు హాజ‌రై యూనిట్‌ సభ్యులకు  శుభాకాంక్షలు తెలియజేశారు.

 

ప్రారంభోత్సవం అనంతరం హీరో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. ‘‘ద‌ర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ ఎగ్జయిటింగ్‌గా అనిపించ‌డంతో ఈ సినిమా చేయ‌డానికి అంగీక‌రించాను. ఇప్పటివ‌ర‌కు నేను చేయ‌ని కథతో  ‘పాగ‌ల్’ సినిమా ఉంటుంది’’ అని అన్నారు.నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘విశ్వక్‌తో ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక క్రేజీ స‌బ్జెక్టుతో ఈ సినిమా తీస్తున్నాం. మంచి ముహూర్తం కావ‌డంతో ఈరోజు లాంఛ‌నంగా సినిమాని ప్రారంభించాం. ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితులు చ‌క్కబ‌డ్డాక షూటింగ్ షెడ్యూల్స్‌ను ప్లాన్ చేస్తాం.

 

న‌రేష్ లాంటి ప్రతిభావంతుడిని ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అని వెల్లడించారు. ద‌ర్శకుడు న‌రేష్ కుప్పిలి మాట్లాడుతూ.. ‘‘విశ్వక్‌సేన్ ఇప్పటివ‌ర‌కు చేసిన సినిమాల‌కు పూర్తి భిన్నమైన స్క్రిప్టుతో ఈ సినిమా చేస్తున్నాం. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకుల‌కు క‌చ్చితంగా ఒక మంచి సినిమా చూశామ‌నే తృప్తి ఈ చిత్రం ఇస్తుంది’’ అని అన్నారు.  ఈ చిత్రానికి చంద్రబోస్ పాటలు రాస్తున్నారు.ఈ సినిమా విశ్వక్ కి హిట్ ఇస్తుందో ఫట్ ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: