ఇండియన్ సినిమా లో హీరోయిన్ లు హీరో ల మధ్య అఫైర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోకి పెళ్లి అయినా సరే హీరోయిన్ ని ప్రేమలో పడేస్తూ ఉంటాడు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. కొంత మంది పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య ఈ ట్రెండ్ మళ్ళీ మొదలైనట్టు ప్రచారం జరుగుతుంది. తెలుగులో ఒక స్టార్ హీరోయిన్ ఒక స్టార్ హీరోతో ప్రేమలో పడింది అంటున్నారు. అతనికి పెళ్లి అయినా సరే రోమాన్స్ చేస్తుందని ఇద్దరూ ఇటీవల రహస్యంగా ముంబై కూడా వెళ్లి వచ్చారని అంటున్నారు. 

 

ఈ విషయం సదరు హీరో ఇంట్లో తెలియడం తో గొడవ కూడా అయిందని అంటున్నారు. ఆ హీరోయిన్ ని పిలిచి ఒక అగ్ర నిర్మాత వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం. అయినా సరే ఆమె తన ప్రవర్తనను మాత్రం మార్చుకోలేదని ఆ హీరో తో ఆమె ప్రేమలో ఉందని అంటున్నారు. సదరు హీరో భార్య ఒక మీడియా పెద్దకు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. దీనితో కుటుంబంలో గొడవలు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక అగ్ర దర్శకుడు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. 

 

ఆమె ఇలాగే చేస్తే మాత్రం తెలుగులో సినిమాలు చేయనిచ్చేది లేదని చెప్పినట్టు సమాచారం. ఇది ఎంత వరకు నిజమో తెలియదని... కాని ఆమె మాత్రం ఆ హీరోతో తిరగడం నిజమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల అతన్ని అవకాశాల కోసం కూడా ఆమె ఇంట్లో నేరుగా కలిసింది అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఈ ప్రచారం మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి ఆ హీరో ఎవరో ఆ హీరోయిన్ ఎవరో గాని సోషల్ మీడియా మాత్రం నానా రచ్చ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: