కొరటాల శివ దర్శకత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయన తీసిన ప్రతి సినిమాలో ఒక అర్ధం ఉంటుంది. కథ అద్భుతంగా ఉంటుంది. సమాజానికి ఉపయోగపడే విధంగా కథ ఉంటుంది. ఆ సినిమా చూస్తే పక్కవారికి సాయం చెయ్యాలి అని అనిపించేలా ఉంటుంది. 

 

ఇంకా అలాంటి సినిమాలే తీస్తాడు దర్శకుడు కొరటాల శివ. ఇంకా ఆ నేపథ్యంలోనే కొరటాల శివ..  అప్పట్లో మహేష్ బాబుతో కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు అనే సినిమా తీశాడు.. ఆ సినిమాలో మహేష్ బాబు పట్టణాలకు వలస వెళ్లే రైతులను అపి అక్కడ ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

 

ఇంకా అలాంటి సినిమా విషయంలో ఓ స్టార్ హీరో కొరటాల శివను హర్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. మన యాంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివను ఆ కథ విషయంలో హర్ట్ చేశారు అంట.. కొరటాల శివ చెప్పిన కథ అంత అద్భుతంగా లేదు అని.. ఆ కథలో ఇంకా మార్పులు అవసరం అని అయన చెప్పారు అంట.. 

 

అందుకే ఆ కథ ముందుగా ఎన్టీఆర్ కి చెప్పిన మహేష్ బాబుతో తీసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. యూట్యూబ్ లో గాసిప్స్ ఓ రేంజ్ లో హైలెట్ అయ్యాయి. అయినప్పటికీ ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. దీంతో ఆ ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో రావడం ఆగిపోయాయి. ఆ తరవాత కొరటాల దర్శకత్వంలో జనతా గ్యారేజ్ రావడం.. అది సూపర్ హిట్ అవ్వడం అంత తెలిసిందే.    

మరింత సమాచారం తెలుసుకోండి: